పవన్‌ ఫ్యాన్స్‌ అందుకే హర్ట్‌ అవుతున్నారట

ఎన్నో అంచనాల మేర తెరకెక్కిన పవన్‌ కళ్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాకు నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. దాంతో సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌లో జోరు తగ్గింది. నిజానికి సర్ధార్‌ వచ్చిన చాలా కొద్ది రోజులకే పవన్‌ నెక్స్ట్‌ సినిమాకు ముహూర్తం కుదరింది.కానీ ఏ ముహూర్తాన ఆ సినిమాకు ఓపినింగ్‌ కార్యక్రమాలు జరిగాయో కానీ, అప్పట్నుంచీ ఆ సినిమా విషయంలో పలురకాల రూమర్స్‌ హల్‌ చల్‌ చేస్తూనే వచ్చాయి. ఇంకా ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు సినిమా విషయంలో.

సూర్యతో అనుకున్న సినిమాకి వరుస పెట్టి డైరెక్టర్లు మారుతూ వస్తున్నారు. ఒక పక్క త్రివిక్రమ్‌, మరో పక్క డాలీ ఇలా ఇద్దరూ ఒకరికొకరు పవన్‌ మెచ్చే స్క్రిప్టుల కోసం వేట కొనిసాగిస్తూనే ఉన్నారు. ఈ లోపల సినిమా మీద బోర్‌ కొట్టినట్లుంది పవన్‌కి. రాజకీయాల్లో వేలు పెడదామనుకుంటున్నాడు. రాజకీయాల మీద దృష్టి మళ్లీ జనాల్లోకి వెళదామనుకుంటున్నాడు. దాంతో ప్రస్తుతం సినిమా నుండి కొంత గ్యాప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.

పాలిటిక్స్‌ మీటింగ్‌ విషయమై విదేశాలకు పవన్‌ వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి పవన్‌ సినిమా ఇంకా ఎప్పుడు పట్టాలెక్కుతుందో. ఎప్పటికి షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందో. ఇవన్నీ జరిగే సరికి చాలా టైమే పట్టేలా ఉంది. ఈ లోపల పవన్‌ ఫ్యాన్స్‌ చాలా హర్ట్‌ అవుతున్నారట. తన అభిమాన నటుడి సినిమా విషయమై ఎలాంటి క్లారిటీ రాక డైలమాలో ఉన్నారు. మరి అభిమానుల మదిలో మెదిలే ఈ డైలామాకు పవన్‌ ఎప్పుడు చెక్‌ పెడతాడో చూడాలి.