నెపోలియన్ అఫీషియల్ కాదా?

చిరంజీవి సినిమాకు టైటిల్‌ కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. టైటిల్‌ విషయంలో సినిమా యూనిట్‌ మాత్రమే కాకుండా అభిమానుల అభిప్రాయాలకి కూడా అవకాశమిచ్చింది చిత్ర యూనిట్‌. దాంతో అభిమానులు తమ అభిమాన హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అందరికీ తెలియజేయడానికి సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడుతోంది.

అందుకే చిరంజీవి కొత్త సినిమా కోసం అభిమానులు ఓ టైటిల్‌ ఫిక్స్‌ చేసి, దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. అదే ‘నెపోలియన్‌’. సినిమా టైటిల్‌ అయితే అదిరిపోయింది. కానీ ఫైనల్‌ చెయ్యాల్సింది రామ్‌చరణ్‌, వినాయక్‌ కదా. అయితే ఇప్పటికే ఈ టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ కూడా వస్తోంది. చాలా సందర్భాల్లో అభిమానుల టైటిల్స్‌ లేదా మీడియాలో విన్పించిన టైటిల్స్‌ సినిమాలకు ఖాయమైపోవడం కూడా చూశాం. ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్‌ ఇప్పటికే ప్రచారంలో ఉండగా, దాన్ని రామ్‌చరణ్‌ ఇదివరకే ఖండించాడు. మెగాస్టార్‌ చిరంజీవిని పోస్టర్‌లలో వేసి ‘నెపోలియన్‌’ అనే టైటిల్‌తో అభిమానులు సోషల్‌ మీడియాలో పండగ చేస్కుంటున్నారు.

చిరంజీవి హీరోగా గతంలో ‘హిట్లర్‌’ అనే సినిమా వచ్చింది. ఆ ప్రేరణతోనే బహుశా చిరంజీవి నుంచి ‘నెపోలియన్‌’ అనే టైటిల్‌తో సినిమాని అభిమానులు ఆశిస్తుండొచ్చు. అభిమానుల సందడి అలా ఉంది. టైటిల్‌ మీద కన్‌ఫ్యూజన్‌ని అతి త్వరలో క్లియర్‌ చేయనున్నారు నిర్మాత రామ్‌చరణ్‌, దర్శకుడు వినాయక్‌. చిరంజీవి పుట్టినరోజునాటికల్లా టైటిల్‌ గురించిన స్పష్టత రావొచ్చునట.