నువ్వు నేను అనిత ప్రెగ్నెంట్ కహాని

తేజ ఫామ్ లో వున్నప్పుడు తీసిన నువ్వు నేను సినిమా గుర్తుందా..అదేనండి ఉదయ్ కిరణ్ అనిత జంటగా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ నువ్వు నేను సినిమా.ఆ సినిమాలో అరేయ్ ఒరేయ్ ఏంట్రా అంటూ ఎంతో చలాకీగా కనిపించిన అనిత,ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత అవకాశాల్లేక బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ.

ఎంచక్కా హిందీ సీరియల్స్ తో కాలక్షేపం చేస్తోంది అమ్మడు.ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది అనిత.ఇంత వరకు అంతా బానే వున్న మీడియా పుణ్యమా అని సెలెబ్రిటీలని జనాలు మర్చిపోనివ్వట్లేదు.ఏదో ఒక గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉంటున్నాయి.తాజాగా అనిత త్వరలో తల్లి కాబోతున్నదని, ఆమె గర్భవతి అయిందని మీడియాలో కథనాలు వచ్చాయి.ఇంకేముంది వరుసపెట్టి ఒకటి తరువాత ఒకరు ఈ ఎపిసోడ్ పై కథనాల్ని వండి వార్చేసారు.

పాపం అనిత దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో అనిత స్పందిస్తూ..బాబోయ్..ఆపండి మీ గాసిప్స్.నేను ప్రెగ్నెంట్ ని కాదు.ఈ మధ్య కొంచెం లావయినా మాట వాస్తవం.అయితే దీనికి నా ప్రెగ్నెన్సీకి ఎటువంటి సంబంధం లేదు.ఈ లావు కేవలం చాకోలెట్స్ ఐస్ క్రీమ్స్ తినడంవల్లనే వచ్చిందని చెప్పుకొచ్చింది అనిత.

ఇంకా అనిత సరదాగా స్పందిస్తూ..చాలా మీడియా సంస్థల నుండి నాకు కాల్స్ వస్తున్నాయి..నేను ప్రెగ్నెంట్ నా అని అడుగుతున్నారు.అయితే నేను ప్రెగ్నెంట్ ని అయితే నేనే స్వయంగా మీడియా కి తెలియచేస్తా..ప్రస్తుతం నేను అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్నానంటే అందుకు కారణం మా ఆయనతో ప్రేమలో ఉండటమే అని అనిత తనదైన స్టైల్లో వివరణ ఇచ్చింది.