నయనతార కోసం ఆగిన బాబు బంగారం

‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు.

‘బాబు బంగారం’ కోసం నయనతార ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. ఆమెకి సంబంధించిన డేట్స్ కొన్ని వృథా అయినట్లు తెలుస్తోంది. దీంతో అదనంగా మరికొన్ని డేట్స్ కేటాయించాలని డైరక్టర్ మారుతి నయన్‌ను అడుగుతున్నాడట. కానీ నయన్ కోలీవుడ్ మూవీలతో డేట్స్ సర్దుబాటు చేయలేనంత బిజీగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో డేట్స్ ఇవ్వలేనని నయనతార చెబుతోందని చెప్పుకుంటున్నారు. మరి మారుతి ఏం చేస్తాడో.. ‘బాబు బంగారం’ ఎప్పటికి సిద్ధమవుతుందో చూడాలి.