జైలుకెళ్లిన పందెం కోడి!

నేరస్థులు జైలుకెళ్లడం మాములే,నేరస్థులకు సహకరించిన వారూ జైలుకెళ్లడం మనం చూస్తుంటాం.కానీ ఇక్కడ పందెం రాయుళ్ళకి సహకరించింది ఎవరో కాదు ఓ పందెం కోడి.ఇంకేముంది పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు.

ఖమ్మం నగరంలోని మమత వైద్యశాల రోడ్డులో ఆదివా రం కోడిపందేలు జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఓ కోడిపుంజును వదిలి పందెంరాయుళ్లు పరారయ్యూరు. దీంతో పోలీసులు కోడిని తీసుకొచ్చి సెల్‌లో పెట్టారు. విషయం మీడియూకు తెలియడం తో దానిని బయట కట్టి వేశారు.