‘జనతా గ్యారేజ్‌’కి టింకరింగ్స్‌

జనతా గ్యారేజ్‌ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలవ్వాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను సెప్టెంబర్‌ 2కి పోస్ట్‌పోన్‌ చేశారు. అయితే ప్లానింగ్‌తో సినిమాలు చేసే కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎందుకిలా ‘ఇన్‌ టైమ్‌’లో పూర్తి చెయ్యలేకపోయాడో తెలియరావడంలేదు. సినిమా అంతా అనుకున్నట్లుగానే చేశారనీ అయితే ఫైనల్‌ టచప్స్‌ తప్పవని భావించి, ఇప్పుడు ఆ పనుల్ని హుటాహుటిన చేపట్టారనీ తెలియవస్తోంది.

ఈ టింకరింగ్స్‌తో సినిమా ఇంకా అందంగా తయారవనుందట. ఇంకో వైపున ఔట్‌ పుట్‌ నచ్చక ఎన్టీయార్‌ కొన్ని మార్పులు చేయమన్నాడని కూడా టాక్‌ వినవస్తోంది. అదీ కాక సినిమా టీజర్‌ బయటికి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ అభిమానులు ఎన్టీఆర్‌ నుండి అంతకు మించి అనే రేంజ్‌లో ఆశిస్తున్నారనీ తెలిసిందట. దాంతో అభిమానుల అంచనాలను అందుకునేలా కూడా ఎన్టీఆర్‌ కొన్ని మార్పులు కోరాడట కొరటాలని. దాంతో అక్కడక్కదడా కొన్ని కొన్ని రిపేర్లు చేయాలని తలంచారట కొరటాల, ఎన్టీఆర్‌ టీమ్‌.

ఇలాంటి కీలక మార్పుల కోసమే ఈ సినిమా విడుదల లేట్‌ అయ్యిందనీ చిత్ర యూనిట్‌ తెలియజేస్తోంది. ఏదేమైనా పోస్ట్‌పోన్‌ తక్కువ రోజులే గనుక ఈ రూమర్స్‌ కూడా సబబు కాదు. కానీ రూమర్స్‌ని ఆపడం ఎవరి తరమూ కాదు కదా. సినిమా విడుదలై, హిట్‌ టాక్‌ తెచ్చుకునేదాకా ఇలాంటి రూమర్స్‌ తప్పవు మరి.