జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!

వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది.

ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో ముక్యంగా వినిపిస్తున్న పేర్లు కర్నూల్ జిల్లా నుండి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి,తూగో జిల్లా నుండి హర్ష కుమార్,ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్లు.పై ముగ్గురిలో కోట్ల,హర్షకుమార్ చేరిక ఎలా వున్న ఉండవల్లి వైసీపీ లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మిగిలిన ఇద్దరి వల్ల వైసీపీ కంటే కూడా వారి వ్యక్తిగా రాజకీయ జీవితానికి వైసీపీ ఉపయోగపడుతుందేమో కానీ ఉండవల్లి చేరిక మాత్రం వైసీపీకి మంచి బలాన్నిస్తుందన్నది వాస్తవం.

ఉండవల్లి వైసీపీ లో చేరనున్నారని ఊహాగానాలకు బలం చేకూరుస్తూ నిన్న YS జగన్ తూగో పర్యటన సందర్బంగా ఉండవల్లి అరుణ్కుమార్ ఇంటికెళ్లి మరీ కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.ఉండవల్లి అరుణ్కుమార్ తల్లి ఈ మధ్యనే మరణించిన సంగతి తెలిసిందే.ఈ భేటీకి కారణం అదే అయినా దాని వెనక వున్న రాజకీయ కోణాన్ని విస్మరించలేం.పైగా ఉండవల్లి అరుణ్ కుమార్ కి దివంగత YS రాజశేఖర రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది.YS కి అత్యంత ఆప్తుల్లో ఉండవల్లి కూడా ఒకరు.ఉండవల్లి ఎప్పుడో వైసీపీ లో చేరుతారని ఊహాగానాలు వినిపించినా అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతు వచ్చింది.

ఏది ఏమైనా ముక్యంగా ఉండవల్లి వైసీపీ లో చేరితే ఓ ఇద్దరికి మాత్రం కంటగింపుగా మారనున్నది.ఆ ఇద్దరే ఒకరు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఇంకొకరు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఎందుకంటే ఉండవల్లికి రామోజీ రావు కి మధ్య ఎప్పటినుండో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి వుందన్నది వాస్తవం.ఇక చంద్రబాబు నాయుడు వ్యవహారం లో కూడా ఉండవల్లి ఒంటికాలిపై లేస్తుంటారు.అదే ఆ ఇద్దరికి ఇప్పుడు ఉండవల్లి వైసీపీ లో చేరిక కంటగింపుకానుంది.

ఉండవల్లి వాక్చాతుర్యం అందరికి తెలిసిందే.ఏ విషయాన్నైనా స్పష్టంగా సూటిగా చెప్పగల నేర్పరి ఉండవల్లి.ఇక వైసీపీ లో జగన్ తరువాత అంత ధాటిగా ప్రతి పక్షాన్ని ఇరుకున పెట్టె సత్తాగల నాయకులు కరువయ్యారు అన్న మాట వాస్తవం .కాబట్టి ఉండవల్లి వైసీపీ లో చేరితే జగన్ కు నైతికంగా ఎనలేని బలం చేకూరుతుంది అన్న వాదన వినిపిస్తోంది.అదీ కాక ఉండవల్లి వ్యక్తిగత ఎజండా వైసీపీ & జగన్ ఎజండా లలో చాలా సారూప్యత ఉంది.ఇద్దరి కామన్ టార్గెట్ రామోజీ అండ్ బాబు. చంద్రబాబుకి రాజకీయంగా రామోజీ రావు ఎంత కొమ్ముకాస్తారో జగద్విగితం.అలాంటిది ఉండవల్లి ఇన్నాళ్లు నిర్వీర్యమ అయిపోయిన కాంగ్రెస్ లో ఉంటూనే వాళ్ళిద్దరిపై ఎదురుదాడి చేసే వారు.అలాంటిది ఇప్పుడు జగన్ అండ్ వైసీపీ అనే బేస్ దొరికితే ఉండవల్లి చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.