గుడి కొట్టు-అభివృద్ధి సోట్టు:చంద్రోపదేశం

ఎక్కడైనా తుఫానుకి ముందు ఏదయినా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్నై తగ్గించవచ్చు.తుఫాను బీభత్సం సృష్టించేసాక అందరూ ధైర్యంగా ఉండండి,ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి లాంటి సూక్తులు ఎందుకు పనికొచ్చేవి?సరిగ్గా ఇలాగే ఉంది విజయవాడలో గుళ్ళు కూల్చివేతపై మన చంద్రబాబు గారి వ్యవహారం కూడా.

ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ తుఫాను చెప్పకుండా వచ్చింది కాదు,తెలీకుండా వచ్చింది అంతకంటే కాదు.బాబు గారు కనుసైగల్లో వచ్చిందే.లేకుంటే బాబు గారికి తెలీకుండా రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకుని వున్న విజయవాడలో అభువృద్ధిపేరుతో దాదాపు 40 కి పైగా గుళ్ళు కూల్చేస్తే అంతా అయిపోయాక ఈయన గారు ప్రెస్ మీట్ పెట్టి తాపీగా చంద్రోపదేసం చేసే ప్రయత్నం చేశారు.

అభివృద్ధికి ఎవ్వరూ అడ్డు తగలరు.కాకపోతే అభివృద్ధి పేరుతో మీరు సృష్టిస్తున్న అధికార దమన కాండే ప్రజాగ్రహానికి కారణం.లేకపోతే సాక్షాత్తు టీడీపీ ఎంపీ ఒకాయన(కేశినేని నాని) అరేయ్ ఒరేయ్ అంటూ దేవాలయ కూల్చివేతకు అడ్డొచ్చిన అర్చకులని సామాన్యులని దూషిస్తూ ఈడ్చేయండ్రా వీళ్ళని అంటూ దుర్భాషలాడటం ఇదేనా చంద్రబాబు చెప్పే ప్రజా స్వామ్య నీతులు.రోడ్డు విస్తరణకు అడ్డంకిగా వున్న గుడైనా,మసీదైనా,చర్చ్ అయినా సరే అడ్డు తొలగించొచ్చు కాకపోతే దానికి ఒక పద్దతి ఉంటుంది.అర్చకులను,భక్తులను,ప్రభుత్వ,ప్రభుత్వేతర సిబ్బందిని,సామాన్యులని సంప్రదించి కూల్చివేతకు ప్రతిగా వేరే ఆలయ నిర్మాణం పై ఇంకొకచోట భరోసానిచ్చి తరువాత ముందు కెళ్ళాలి కానీ ఇలా అర్ధరాత్రి, అడ్డొచ్చిన వారిని ఈడ్చి పడేసి,రహస్యంగా కూల్చేయడం నిజంగా హీనమైన చర్య.

ఇదంతా చంద్రబాబుకి తీలేకుండా జరిగిన వ్యవహారం అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు.అంతా అయ్యాక ఈ రోజు ఈయనగారు ప్రజలంతా సమన్వయంతో ఉండాలి,ఇది చాలా సున్నితమైన అంశం అని తొలగింపు శాస్త్రోక్తంగా జరగాల్సి ఉందని సెలవిచ్చారు.అయినా కూల్చేశాక ఇంకా శాస్త్రోక్తంగా ఎం జరగాలో ఎవ్వరి అర్థం కాలేదు.ఎవ్వరూ తొందరపడకూడదట,రోడ్డెక్కి అస్సలు మాట్లాడకూడదట.అంటే అంతా అయ్యాక తాపీగా బాబుగారి మీడియా ముచ్చట్టు వింటూ కాలక్షేపం చెయ్యాలన్నమాట.పనిలో పనిగా ఎప్పటిలాగే దీని వెనుక కొందరు అల్లర్లు సృష్టిచేందుకు ప్రయత్నిస్తున్నారని పాడిన పాటే పాడి ముగించారు పాపం.