‘కబాలి’ ఇట్స్‌ ఏ బ్రాండ్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా వస్తోన్న ‘కబాలి’ సినిమా క్రియేట్‌ చేస్తున్న సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకి జరుగుతున్నంత పబ్లిసిటీ ఇంకే సినిమాకి జరగలేదంటే నమ్మి తీరాల్సిందే. కేవలం సౌత్‌లోనే కాదు ప్రపంచం మొత్తం ఈ సినిమా ఫీవర్‌ తాకింది. ఇదొక సినిమా పేరు కాదు ఇదొక బ్రాండ్‌ అనేలా దేశ దేశాల ఖ్యాతి గడిస్తోంది విడుదలకు ముందే ఈ సినిమా.

పిల్లల కోసం బొమ్మలు, పెద్దల కోసం ఫోన్లుతో పాటు వాణిజ్య పరంగా అనేక రకాల సూపర్‌ స్టార్‌ సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు. పాపులర్‌ చాక్లెట్‌ కంపెనీ అయిన ‘క్యాడ్‌బరీ సంస్థ సూపర్‌ స్టార్‌ పేరుతో ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్లు తయారు చేస్తున్నారట. ఈ చాక్లెట్లు, ‘కబాలి’ సినిమా ధియేటర్లతో పాటు పాపులర్‌ షాపింగ్‌మాల్స్‌లో కూడా ఈ చాక్లెట్లు విక్రయించనున్నారట. వావ్‌ పిల్లలకి ఇది భలే సరదా కదా.

అంతేకాదు ఏకంగా ఎయిర్‌ ఏషియా సంస్థ సూపర్‌స్టార్‌ స్టిల్స్‌తో ఒక విమానాన్నే డిజైన్‌ చేసేసింది. అంతేకాదు ప్రముఖ జ్యూయలరీ షాపు యజమాని రజనీ కాంత్‌ బొమ్మతో గోల్డ్‌ కాయిన్స్‌ విడుదల చేశారు. ఒక ప్రముఖ మొబైల్‌ సంస్థ రజనీ సిమ్‌ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చారట. ఇలా ఒక్కటేమిటీ, మన ఇండియానే కాకుండా అమెరికా, చైనా ఇలా చాలా దేశాల్లో రజనీకాంత్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. విడుదలకు ముందే ఇంత హైప్‌ క్రియేట్‌ అవుతున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.