ఆయన మాస్ ఈయన క్లాస్:కలిస్తే రచ్ఛే

మెగా హ్యాట్రిక్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అంటే మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల్లో మాస్ ని ఒక ఊపు ఊపేసాడు ఈ మెగా హీరో.కాగా ఈ హ్యాట్రిక్ హీరో కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది.
అదే క్లాస్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో అనుష్క తమన్నా హీరోయిన్లు గా ఒకేసారి నాలుగు భాషల్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం.

తమిళ పరిశ్రమకు దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్(జీవీఎం) ఎంత దగ్గరో తెలుగు చిత్రసీమకూ అంతే దగ్గర. ఆయన తమిళంలో తీసిన సినిమాలో తెలుగునాటా జయభేరి మోగించాయి. ఏక కాలంలో తెలుగు-తమిళ వెర్షన్‌లు తీసి రెండు టాలీవుడ్‌-కోలీవుడ్‌ల్లోనూ సత్తా చాటారు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమిళంతో ఇదే చిత్రాన్ని శింబు హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తైన తర్వాత జీవీఎం ధనుష్ కథానాయకుడిగా ‘ఎనై నొకి పాయుమ్ తొట’ అనే ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు.

ఈ మూడు చిత్రాల తర్వాత జీవీఎం ఏం చేయబోతున్నారన్నదే ఆసక్తిగా మారింది. నాగచైతన్య, శింబు, ధనుష్‌ల సంగతి చూసిన తర్వాత ఈయన ఓ మల్టీస్టారర్‌ చేస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమాలో దక్షిణాది చిత్రసీమలకు చెందిన హీరోలు నటిస్తారని అంటున్నారు. తమిళ సినీ పరిశ్రమ నుంచి జయం రవి, మలయాళ చిత్రసీమ నుంచి పృథ్విరాజ్, కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి పునీత్ రాజ్‌కుమార్‌..ఇక టాలీవుడ్‌ నుంచి మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్‌లు ఈ చిత్రంలో కథాయనాయకులని చెప్తున్నారు. అనుష్క, తమన్నాలు కూడా హీరోయిన్లుగా బుక్‌ అయ్యారని మరో ఇద్దరు భామల కోసం జీవీఎం వేటాడుతున్నారని వినికిడి.