అవార్డిచ్చారు..హక్కులు కొట్టేశారు

చాలా ప్రముఖ మీడియా ఛానల్స్ ఉన్న మన తెలుగులో.. సినిమాలను కొనుక్కో వాలంటే మాత్రం ముగ్గురే ముగ్గురు. మా టివి.. జీ తెలుగు.. జెమిని టివి తప్పిస్తే అసలు మిగిలిన వారు శాటిలైట్ బిజినెస్ లో మాత్రం వేలు పెట్ట ట్లేదు. ఇకపోతే ఇప్పుడు ”జనతా గ్యారేజ్” శాటిలైట్ రైట్ల గురించి మాట్టాడుకోవా ల్సిన సమయం వచ్చేసింది.

ఇప్పటికే సినిమాను సెప్టెంబర్ 2న వితౌట్ ఎనీ డౌట్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కొరటాల శివ. అందుకే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను కూడా.. కొరటాల గత సినిమా శ్రీమంతుడుని కొనుక్కున్న జీ తెలుగు ఛానల్ కొంటుందని కొందరు అంటే.. అబ్బే కాదు ఎన్టీఆర్ గత సినిమాను కొనుక్కున్న జెమిని వారే తీసుకుంటారు అని మొన్నటి వరకు టాక్ ఉండేది.

అయితే ఇప్పుడు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. మొన్ననే ఎన్టీఆర్‌కు ”ఉత్తమ నటుడు” అవార్డును ఇచ్చిన మా టివి వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించు కున్నారట. దాదాపు 12.5 కోట్లకు మా టివి ఈ డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న ఎవరైనా కూడా.. అవా ర్డిచ్చి రైట్స్ పట్టేశా రుగా అంటూ కామెంట్లు చేస్తు న్నారు. నిజానికి పైన పేర్కొన్న మూడు ఛాన ల్స్‌లో ఎవరు బెస్ట్ డీల్ ఆఫర్ చేశారో వారికి అమ్మేశాం అంటున్నారు మైత్రి మూవీస్ వర్గాలు.