హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో నాగచైతన్య?

హరీష్‌ శంకర్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌. హీరోని మాస్‌లుక్‌లోనూ, క్లాస్‌ లుక్‌లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్‌ హరీష్‌. సినిమా ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్‌ చేయమని హరీష్‌ని అడిగాడట. అయితే అఖిల్‌ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్‌. ‘రామయ్యా వస్తావయ్యా’, సినిమా ఫ్లాప్‌ అయినా, ‘గబ్బర్‌సింగ్‌’ సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. గొప్ప టాలెంట్‌ ఉన్న యువ దర్శకుడు హరీష్‌. నాగచైతన్యకు మాస్‌ హీరో ఇమేజ్‌ని తీసుకురావాలని చాలా ట్రై చేశాడు కానీ వర్కవుట్‌ కాలేదు ఇంతవరకూ. కొడుకుని మాస్‌ హీరోగా చూడాలనే కోరిక హరీష్‌ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాడట నాగార్జున. ప్రస్తుతం నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటిస్తున్నాడు. గౌతమ్‌ మీనన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించాడు. మంజిమ మోహన్‌, నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో సినిమా మళయాళ్‌ రీమేక్‌ ప్రేమమ్‌’లో కూడా నటిస్తున్నాడు ఈ అక్కినేని హీరో.