సింగపూర్ సంస్థకు అమరావతి ఛాన్స్

కొత్త రాజధాని అమరావతి అభివృద్ధి అవకాశాన్ని సింగపూర్‌ కన్సార్టియంకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే సింగపూర్‌ సంస్థకు 58 శాతం ఈక్విటీని ఖరారు చేశారు. ఈ పెట్టుబడికి అదే స్థాయిలో ఆదాయాన్ని కూడా సమకోర్చాలని నిర్ణయిరచారు. సింగపూర్‌ సంస్థకే స్విస్‌ ఛాలెంజ్‌ ద్వారా రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించేందుకు దాదాపు నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థకు కల్పించాల్సిన ప్రయోజనాలపైనా అధికారులు విస్తృతంగా కసరత్తు చేశారు. గత నాలుగు రోజులుగా ఇదే అంశాలపై ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. ఐదేళ్ల తరువాత ఈ మొత్తాన్ని సింగపూర్‌ సంస్థకు అప్పటి మార్కెట్‌ విలువ మేరకు చెల్లించేందుకు కూడా నిర్ణయిరచారు. ఈ ఫైలు సిఆర్‌డిఎ ద్వారా ఇన్‌ఫ్రో అధారిటీకి చేరుకుని, అక్కడి నురచి ముఖ్యమంత్రికి తాజాగా చేరుకుంది. 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోదించనున్నారు.

సిరగపూర్‌కు చెందిన అసెండాస్‌-సిన్‌బ్రిడ్జి, సెమ్‌క్రాప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఒక కన్సార్టియంగా ఏర్పడి సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణానికి తమ ప్రతిపాదనలు పంపించగా, ఆ ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఇతరులు సవాల్‌ చేసేందుకు బహిరంగంగా ఉంచనుంది.

ఈ కన్సార్టియం అమరావతిలోని 1600 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వ భవనాలు నేరుగా ప్రభుత్వమే నిర్మిస్తున్న నేపథ్యంలో మిగిలిన రంగాలను సిరగపూర్‌ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఇందులో వాణిజ్య సముదాయాలే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థకు అందుకు అనుగుణంగానే ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అమరావతి ఫైలును అధ్యయనం చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒప్పందం ఖరారు చేసిన తరువాత సింగపూర్‌ కన్సార్టియం అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ (ఎడిబి)తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎడిబికి వచ్చే ప్రయోజనాల్లో 58 శాతం వరకు సింగపూర్‌ సంస్థకు ఇచ్చేందుకు, మిగిలిన 42 శాతాన్ని ఎడిబికి అందించేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కేవలం భూమి ఇస్తుందని, మిగిలిన కార్యక్రమాలు సింగపూర్‌ సంస్థే తన నిధులతో అమలు చేస్తుందని అధికారులు అంటున్నారు.
ఇదే సమయంలో అమరావతికి వెళ్లే ఉద్యోగులపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మరో వారం రోజుల్లో అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు రాజధానికి తరలి వెళ్లాల్సిన ఉన్న నేపథ్యంలో అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఉద్యోగులకు రెండు ఇంటి అద్దె అలవెన్సులు చెల్లించేందుకు ప్రతిపాదించారు.

హైదరాబాద్‌లో ఉంటున్న వారికి ఇప్పటికే హెచ్‌ఆర్‌ఎ చెల్లిస్తున్నారు. వారంతా కొత్త రాజధానికి తరలివెళ్తే వారికి అక్కడ కూడా కొంతకాలం హెచ్‌ఆర్‌ఎ ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ వసతిని ఉపయోగించుకుంటున్న వారుంటే వారికి ఇక్కడ ఉచిత వసతి కొనసాగిస్తూనే, కొత్త రాజధానిలో మరో హెచ్‌ఆర్‌ఎ కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు వెళ్లినట్లు సమాచారం.

ఇదే సమయంలో హెచ్‌ఓడిల తరలింపు అనుకున్న సమయంలోగా పూర్తి చేసేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. తరలివెళ్లాల్సిన శాఖల అధికారులతో సచివాలయ అధికారులు ప్రతి రోజూ మంతనాలు సాగిస్తున్నారు.