సాక్షి కి సంకెళ్ళు – కొడాలీ సినిమాటిక్ సెటైర్లు

కొడాలి నాని పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. గుడివాడ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగ గెలిచిన ఈయనకు గుడివాడలో సూపర్బ్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈయన సినీ నిర్మాత కూడా. అలాంటి ఈయన సినిమాలపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేసారు . మీ బావమరిది, మీ సోదరుడి కొడుకు సినిమాల్నే టీవీల్లో చూడాలా? మీకు నచ్చని ఛానళ్ళను బంద్‌ చేయిస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీసారు.

ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ ప్రసారాలపై తాత్కాలికంగా వేటు వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన వివరనే హైలైట్. ఉద్యమంలో బాగంగా ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తుండడంతో, ఎక్కడా అసాంఘీక శక్తులు పెచ్చిపోకుండా, రూమర్లకు తావు లేకుండా చూడాలన్న ప్రయత్నమే ఇదంట.అసలు ప్రభుత్వమే ఓ అసాంఘీకశక్తీ లా పనిచేసి మీడియా నోరు మూయించేస్తుంటే ఇంకా వేరే శక్తులు ఎందుకు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే సాక్షి ఛానల్‌ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వార్తా ప్రసారాలు లేకుంటే వారి మీద అసాంఘీక శక్తులు, ఉద్రిక్త పరిస్థితులు నెపం మోపి వారి నోరు మోయిన్చేస్తాం అని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం.

అయినా చంద్రబాబు పిచ్చి గాని మీడియాని కంట్రోల్‌ చేస్తే కంట్రోల్‌ అయిపోయేలా లేదిప్పుడు. డిటిహెచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్‌ ఉండనే ఉంది కదా. చంద్రబాబు కాపులపై మోపుతున్న ఈ ఉక్కు పాదం దెబ్బకి తెలుగుదేశం కాపు నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఖచ్చితంగా ముద్రగడ పైన ఆయన ఫామిలీ పైన చంద్రబాబు వ్యవహరించిన తీరు,ముద్రగడ కొడుకుని బట్టలు చిరిగేలా కొట్టుకుంటూ తీసుకెళ్ళడం,ఆయన సతీమనిని బలవంతంగా పోలీస్ వ్యాన్లో విసిరేయడం వంటి విషయాలు మొత్తం కాపు జాతి స్వాభిమానాన్ని దెబ్బతీసాయి.దీని దెబ్బ తెలుగుడెం పార్టీ కి గట్టిగానే తగలనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.