సల్మాన్ అవి చేయడట!

సల్మాన్ ఖాన్.. ముందు-వెనకా.. ప్రస్తుతం వస్తున్న హీరోలు… అంతా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్‌ రోషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. యాంటీ హీరోగా వీరంతా ప్రేక్షకులను మెప్పించారు. కానీ సల్లూ భాయ్ మాత్రం అలాంటి రోల్‌ ఒక్కటి కూడా చేయలేదు. ఇదే విషయమై స్పందిస్తూ తనకు విలన్ పాత్రలంటే నచ్చదని చెప్పారు. తానెప్పుడూ హీరోగానే ఉండాలనుకుంటున్నానని.. విలన్ రోల్స్ చేయనని స్పష్టం చేశారు. థియేటర్‌కు వచ్చే సగటు ప్రేక్షకుడు మంచి స్మృతులతో ఇంటికి వెళ్లాలన్నదే తన పాలసీ అని.. అందుకే నెగెటివ్ పాత్రల జోలికి పోలేదని వివరించారు.

విలన్ పాత్రలు చేయకపోవడానికి మరో కారణమూ వివరించారు సల్మాన్. యువత నటులను ఫాలో అవుతుంటుందని.. వారికి మార్గదర్శకంగా ఉండాలన్న ఆలోచనతోనే హీరో పాత్రలే చేస్తున్నానని చెప్పారు. నిజ జీవితంలో యువకులను వీరులుగా మార్చాలన్న ఉద్దేశంతో మాంఛి హీరోయిజం ప్రదర్శించే సీన్స్ చేస్తుంటానని అన్నారు.