రేసు గుర్రానికి గబ్బర్‌సింగ్‌ తోడైతే!!

ఎనర్జిటిక్‌ హీరో అల్లు అర్జున్‌. నిజంగా రేసు గుర్రమే. బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ సూపర్‌ స్పీడ్‌లో ఉన్నాడు. ఎనర్జిటిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడట. ఇంకేం ఈ రేసుగుర్రాలు ఇద్దరూ ఒకటైతే ధియేటర్లో రచ్చ రచ్చే. అదే జరగనుందట త్వరలో. వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్‌ మసాలా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒకటి రెఢీ కానుందట. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ కథాంశానికి తనదైన క్లాస్‌ ట్రీట్‌మెంట్‌తో హరీష్‌ శంకర్‌ కొత్త ఫ్లేవర్‌ అద్దాడట. ఈ సినిమాలో మరింత జోరుగా కనిపించనున్నాడట అల్లు అర్జున్‌. అంతేకాదు ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ కొత్త లుక్‌ ఒకటి ట్రై చేస్తున్నాడని సమాచారమ్‌. ఈ సినిమాకి యంగ్‌ ఆండ్‌ ఎనర్జిటిక్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించే అవకాశముంది.

అబ్బో ఇంకేముంది సినిమా అంతా ఫుల్‌ ఎనర్జీనే. ఇంత ఎనర్జిటిక్‌ స్టోరీలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయనున్నాడట అల్లు అర్జున్‌. ఆ ఇద్దరూ శృతిహాసన్‌, కేధరిన్‌లు కావచ్చని తెలుస్తోంది. ఇంతకు ముందు ‘రేసుగుర్రం’లో శృతిహాసన్‌తోనూ, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో కేథరిన్‌తోనూ జత కట్టాడు అల్లు అర్జున్‌. తాజాగా ‘సరైనోడు’ సినిమాతో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన అల్లు అర్జున్‌ మరో రికార్డ్‌ బ్రేకింగ్‌కి రెఢీ అయిపోతున్నాడన్న మాట. అతి త్వరలో సినిమా పట్టాలెక్కనుందని సమాచారమ్‌.