బాలీవుడ్‌లో తాప్సీ సెన్సేషన్‌

తెలుగులో మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల చిన్నది తాప్సీ. తొలి సినిమాతోనే అబ్బా భలే ఉందే ఈ ముద్దుగుమ్మ అనిపించేలా కనిపించింది ఆ సినిమాలో తాప్సీ. అదంతా దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి మహిమే. అయితే ఆ తరువాత కూడా మంచు వారి ఫ్యామిలీతోనే ఎక్కువ ఎటాచ్‌మెంట్‌ పెట్టుకుందీ భామ. బాలీవుడ్‌లోనూ, తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ దక్షిణాది నుంచి మాయమై బాలీవుడ్‌లో సెటిలైపోయినట్టుగా ఉంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో ‘పింక్‌’ అనే సినిమాలో నటిస్తోంది. అంతే తాప్సీ పేరు అమాంతం మార్మోగిపోతోంది అక్కడ. ‘ఛష్మే బద్దూర్‌’ వంటి సినిమాల్లో నటించినా తాప్సీకి ‘పింక్‌’ సినిమానే బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌. ఇందులో తన నటనకు మంచి మార్కులు పడతాయని చెబుతుందీ సొట్ట బుగ్గల సుందరి. అమితాబ్‌ బచ్చన్‌ సరసన నటించడమంటే మొదట్లో భయమేసిందట. సెట్‌లో సరదాగా ఉంటూ అమితాబ్‌ బచ్చన్‌, పలు అంశాల్ని చర్చించే సరికి అతని మీద భయం పోయి గౌరవం పెరిగిందట తాప్సీకి. అమితాబ్‌ బచ్చన్‌ గురించి ఇలా గలగలా తాప్సీ మాట్లాడేస్తోంటే బాలీవుడ్‌ వర్గాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. సౌత్‌కి అయినా బాలీవుడ్‌కి అయినా పెర్‌పెక్ట్‌గా సూటయిపోయే ఫేస్‌ కట్‌ తాప్సీ సొంతం. గ్లామర్‌తోనూ తాప్సీకి వంకలు పెట్టడానికేమీ లేవు. బాలీవుడ్‌లో సెన్సేషన్‌ అయిపోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్న సొట్ట బుగ్గల సుందరి తాప్సీకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.