ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్

తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.

జయతే కూచిపూడి’ ముగిసిన తర్వాత యూరప్‌లోని అభిమానులను పవన్ కలుసుకోనున్నారు. అంతేకాక వివిధ కార్యక్రమాలకు హాజరవుతారని తెలుస్తోంది. ‘యుక్తా’వారి ఆధ్వర్యంలోనే పవన్ కల్యాణ్ కి సంబంధించిన ప్రయాణం ఏర్పాట్లన్నీ జరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. పవన్‌కు కాస్త ఖాళీ సమయం చిక్కిందని..ఈ టైమ్‌ను విదేశాల్లోని తన అభిమానులతో గడపడానికి కేటాయించారని అంటున్నారు.