నివేదా థామస్ కి ఒకే చెప్పిన NTR

ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీయే డైరక్టర్‌ కూడా.

ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్‌కు నటన పరంగా ప్రాధాన్యత ఉందట. దీంతో చిత్రబృందం కథానాయిక కోసం బాగానే కసరత్తు చేసి..నివేదా థామస్‌ దగ్గర ఆగిందట. ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా బాగా నటించింది. ఇదే విషయాన్ని తారక్‌కు చెప్పగా ఆయన ఓకే అన్నట్లు సమాచారం. నివేదాకు కథ వినిపించడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్టే అని అంటున్నారు.