నాగార్జునతో గౌతమ్‌ సినిమా పక్కా!!

నాగార్జున అంటే స్టార్‌ హీరో. ప్రముఖ నిర్మాత కూడా. అలాంటి నాగార్జున అడిగితే ఏ దర్శకుడైనా కాదంటాడా? గౌతమ్‌ మీనన్‌ కాదన్నట్టున్నాడు. నాగార్జున హర్టయినట్టున్నాడు. ఎంతైనా బిజినెస్‌ మేన్‌ కదా, తాను హర్టయిన విషయాన్ని నాగార్జున, సున్నితంగా గౌతమ్‌ మీనన్‌కి తెలియజేశాడు. తన కుమారుడి సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన నాగార్జున, ఆ చిత్ర దర్శకుడైన గౌతమ్‌ మీనన్‌తో ఓ సినిమా చేయాలన్న కోరికను ఇంకోసారి బయటపెట్టారు. నాగచైతన్యకి రెండో ఛాన్స్‌ ఇచ్చారు, నాతో ఒక్క సినిమా కూడా చేయలేదని నాగ్‌ అనడం ఆశ్చర్యపరిచింది అక్కడున్నవారిని. అయితే గౌతమ్‌ మీనన్‌తో నాగార్జున సినిమా కన్‌ఫామ్‌ అయ్యిందనీ ఆ ఉద్దేశ్యంతోనే నాగార్జున డ్రమెటిక్‌గా ఇదంతా చేశారని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ గౌతమ్‌ మీనన్‌ గొప్ప దర్శకుడు. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని నాగార్జున లాంటి వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ అనుకోవడంలో తప్పు లేదు. విలక్షణ చిత్రాల దర్శకుడితో, నాగార్జున సినిమా చేస్తే అది ఖచ్చితంగా సంచలనమే అవుతుంది. నిర్మాత అయిన నాగార్జునకి ఈ విషయం బాగా తెలుసు. రాఘవేంద్రరావుతో భక్తిరస చిత్రమొకటి చేస్తున్న నాగార్జున ఆ తరువాత గౌతమ్‌ మీనన్‌తో సినిమా చేయనున్నాడనీ ఇందులో నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారనీ సమాచారమ్‌. కమింగ్‌ డేస్‌లో ఈ మూవీకి సంబంధించిన కంప్లీట్‌ డిటెయిల్స్‌ బయటకు రావొచ్చు.