పాపం ఈ జంపింగ్ లు అభివృద్ధి కోసమేనట..హవ్వ..

నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాన్కర్ రావు, రవీంద్రనాయక్ తాము అధికార‌ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్న‌ట్లు ప్రకటించారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములం కావాల‌నే టీఆర్ఎస్‌లో చేరుతున్నామని సెలవిచ్చారు. తాము ఎల్లుండి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను వీడుతుండ‌డం తమకు బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. కాంగ్రెస్‌లోని అంతఃక‌ల‌హాల‌తో తాము మ‌నో వేద‌న‌కు గుర‌య్యామ‌ని బరువెక్కిన గుండెతో బాధను వెళ్ళబోసుకున్నాడు.ఈ ఓవర్ ఆక్షన్ లో ఎక్కడ కన్నీటి పర్యంతం ఎపిసోడ్ వుంటుందో అని అందరు భయపడిన అది లేక పోయే సరికి ఊపిరి పీల్చుకున్నారు.

ఇక వివేక్ గారయితే తన కలల తెలంగాణా కెసిఆర్ లైవ్ లో చూపిస్తున్నాడు అందుకే నేను జంప్ అని లెక్చర్ ఇచ్చారు.పనిలో పనిగా తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ప్ర‌యత్నాలు చేశామ‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గొప్ప వ్య‌క్తి అని, తెలంగాణ ఇవ్వాల‌ని ఆమె నిర్ణ‌యం తీసుకున్నారని మేడం మీద ఎనలేని భక్తిని వోలకబోసారు.

ఇక రవీంద్రనాయక్ రొటీన్ స్క్రిప్ట్ చదివేశారు.దేవరకొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు , రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్‌ అంకితభావంతో పనిచేస్తున్నారన్న నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పుకొచ్చారు.

చివరగా V బ్రదర్స్ వంతు రాగా తమ తండ్రి తాతల దగ్గరినుండి వీరంతా తెలంగాణా పోరాట యోదులమన్నంత కలరింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ తండ్రి వెంకటస్వామి కల అని, ఆయన కలను సాకారం చేసేందుకే తాను తన సోదరుడు వివేక్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని మాజీ మంత్రి జి.వినోద్ అన్నారు.

ఇదంతా దగ్గరే వుంది వీక్షిస్తున్న విలేఖరులకి విసుగోచ్చిందేమో పాపం పార్టీ మరుతున్నాటు సమాచారం ఇస్తే మేమే పాత స్క్రిప్ట్ ని మల్లి రాసేస్తాము కాదా దానికోసం ఎందుకు ఈ ప్రెస్ మీట్లు అని చెవులుకొరుక్కున్నరు.