జెంటిల్ మన్ వసూళ్ళు చూసి శర్వానంద్ బాధపడుతున్నాడా ?

జెంటిల్ మన్ సినిమా నానికి హ్యాట్రిక్ హిట్ ను అందించి ఉండవచ్చు కానీ.. శర్వానంద్ కు మాత్రం ఇబ్బంది పడేలా చేసిందట. నిజానికి జెంటిల్ మన్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మొదట ఈ సినిమా కథను శర్వానంద్ కే వినిపించాడట. అయితే హీరోయిజమ్ లో విలనీ ఎక్కువైందనీ భావించిన శర్వా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. నిజానికి జెంటిల్ మన్ కథ శర్వానంద్ కి వంద కు వంద శాతం యాప్ట్ స్టోరీ..అయినా..లేని పోని భయాలతో శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ ను మిస్ చేసుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు అదే కథతో నాని హిట్ కొట్టే సరికి శర్వా అరే మంచి హిట్ సినిమాను మిస్ అయిపోయానే అని ఫీలవుతున్నాడట.రన్ రాజ్ రన్, ఎక్స్ ప్రెస్ రాజా, లాంటి హిట్స్ తో మాంచి జోరు మీదున్నాడు శర్వానంద్. స్టార్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దశలో విలన్ కి దగ్గరికే క్యారెక్టర్ హైలైట్ అయితే కష్టం అనుకున్నాడు అందుకే జెంటిల్ మన్ ను మిస్ చేసుకున్నాడు. మరో వైపు నాని భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గథా సినిమాల తర్వాత జెంటిల్ మన్ సినిమా రూపంలో మరో హిట్ ను ఖాతాలో వేసుకొని… కెరీర్ లో హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్నాడు.
మొదట యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఇప్పుడు స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు లేకపోవడం తో నానికి వరంగా మారింది. ఓవర్సీస్ లోనూ నాని రెండున్నర కోట్లకు రీచ్ కావడంతో… జెంటిల్ మన్ టీం మంచి ఉత్సాహంగా ఉంది.