జనతా గ్యారేజ్ రిలీజ్ కి ముందే రికార్డ్!!

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈనెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఆ తర్వాత పాటల్ని చిత్రీకరించి, ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మిర్చి, శ్రీమంతుడు సినిమాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోందట. ముఖ్యంగా ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఈ సినిమాకు 60 కోట్లకు పైగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్.