క్రిష్ నిశ్చితార్థం వేడుకలో బాలయ్య

మొత్తానికి క్రిష్ ఓ ఇంటివాడు కావడానికి మొదటి అడుగు వేసాడు.సందేశాత్మక సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్,కేర్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రమ్య ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

వీరిద్దరి పెళ్లి గురించి ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు అదిగో పెళ్లి ఇదిగో నిశ్చితార్థం అంటూ దోబూచులాడినా ఈ జంట పెళ్లి ఘట్టం ఎట్టకేలకు పట్టాలెక్కింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ హాజరయ్యారు.బాలకృష్ణతో కృష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలకృష కెరీర్ లో 100 వ సినిమాని తెరెకెక్కించనున్న విషయం మనందరికీ తెలిసిందే.బాలకృష్ణ సతీ సమేతంగా వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు.