కోదండరాం ని కెలకొద్దు – కెసిఆర్

తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం 12 మంది టీఆర్ఎస్ మంత్రులు, నేతలు మప్పేట దాడి చేశారు. ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఇది ప్రతిపక్షాలకు అనుకోని వరం అయ్యింది .కెసిఆర్ ని విమర్సించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవారు కూడా ఒంటి కాలి పై లేచి విమర్శలు గుప్పించారు.ఇది తెరాస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. కోదండరాంపై విమర్శల దాడి కొనసాగిస్తే ప్రస్తుతం సజావుగా ఉన్న పరిస్థితులు వేడేక్కె అవకాశమున్న నేపథ్యంలో కోదండరాం విషయంలో కొంత కాలం వరకు సంమయనం పాటించడమే బెటరని భావిస్తున్నారు కేసీఆర్. అందుకే మంత్రులు, పార్టీ నేతలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.