కబాలి పోస్టర్ కాఫీ కొట్టారా?

రజినీకాంత్‌ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’ జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. కబాలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో… అన్నే వివాదాలకు కారణమౌతుంది. తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే.

మరో వైపు విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది చిన్న సినిమా అయినా, తమ సినిమా పోస్టర్‌ను దొంగలించి కబాలి కోసం వాడుకున్నారని అన్నారు. అయితే దీని పెద్ద విషయంగా పరిగణించవద్దని, అభిమానులు రజనీ సినిమాతోపాటు తమ సినిమాను కూడా చూడాలని ఆయన సూచించారు.రెండు పోస్టర్లలోనూ ప్రధాన నటుల ముఖాలతోపాటు అడ్డు వరుసలో ఉన్న భవనాలను చూపించారు.