పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే.మొత్తం మీడియా దగ్గరినుండి సామాన్య అభిమాని వరకు పవన్ కళ్యాణ్ న్యూస్ అంటే ఏంటో ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు.ఇక పవన్ కొత్త సినిమా సంగతులగురించి అయితే చెప్పనవసరం లేదు.ఇప్పటికే దర్శకుడు ఎస్ జే సూర్య తో పవర్ స్టార్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది,త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లనుంది.దీని తరువాత పవన్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.
అయితే పవన్ ,ఎస్ జే సూర్య సినిమాకి సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ లో హల్చల్ చేస్తోంది.ఈ సినిమాకి “కడప కింగ్” అనే టైటిల్ ని ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ ఊహాగానాలకి బలం చేకూరుస్తు చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు.దీంతో పాటు సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది
ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేదే తరువాయి అని,కడప కింగ్ ప్రస్తుత రాజకీయాల పరంగా కూడా కలిసోస్తుందని అదే టైటిల్ ని అనౌన్సు చేసే అవకాశాలున్నట్టు కూడా ఇన్సైడ్ టాక్.