అనుష్కపై కన్నేసిన నాగశౌర్య

‘ఊహలు గుసగుసలాడే’ సినిమా నుండీ నాగశౌర్య మంచి లవ్‌ స్టోరీస్‌నే ఎంచుకుంటూ లవర్‌ బోయ్‌గా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే లవర్‌ బోయ్‌ ఇమేజ్‌నే కాదు ఈ కుర్రోడు తాను ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకుంటున్నాడనీ రూమర్‌ నడుస్తోంది. రూమర్స్‌ అనేవి ఎక్కువగా హీరోయిన్స్‌నే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ కొత్తగా పాపం మన హీరోని వెంటాడుతున్న ఈ రూమర్‌తో నాగశౌర్య చాలా ఫీలవుతున్నాడట. దాంతో తన కెరీర్‌కి ఏమైనా దెబ్బ తగుల్తుందేమో అని గోల చేస్తున్నాడు ఈ కుర్రహీరో. తాను చేసిన హీరోయిన్స్‌ అందరూ తనకి మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అంటున్నాడు. తొలి సినిమాతో పరిచయమైన రాశీఖన్నా దగ్గర నుండీ ప్రస్తుతం తాను హీరోగా చేస్తున్న నిహారిక వరకూ తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనీ అంటున్నాడు నాగశౌర్య. దయచేసి తనపై ఇలాంటి రూమర్స్‌ పుట్టించొద్దు, తనకు ఫ్యామిలీ హీరోగా కూడా మంచి పేరుందనీ, ఆ పేరు చెడగొట్టద్దనీ అంటున్నాడు.

ఇంకా కావాలంటే ఇలా రూమర్స్‌ క్రియేట్‌ చేసేవారికి ఒక బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాడు మనోడు. తనకి ‘అరుంధతి’ అనుష్కంటే చాలా ఇష్టమనీ, కావాలంటే ఆమెతో అఫైర్‌ ఉందనే రూమర్‌ పుట్టిస్తే పర్సనల్‌గా తాను హ్యాపీగా ఫీలవుతానంటున్నాడు నాగశౌర్య. ఆహా! మనోడిది ఏం తెలివి. స్టార్‌ హీరోయిన్‌తోనే అఫైర్‌ కావాలంటున్నాడు. అలా పబ్లిసిటీ కొల్లగొట్టేయాలనుకుంటున్నాడు. అయినా రాయమంటే గాసిప్స్‌ రాయరు కదా, నిప్పు లేకుండా పొగ అసలే రాదు. కెమిస్ట్రీ ముదిరిందనిపించినప్పుడే గాసిప్స్‌ వస్తాయ్‌. సర్లెండి, అదలా ఉంచేద్దాం. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా వస్తున్న ‘ఒక మనసు’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.