ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ప్రభుత్వ-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అలాగే తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంతరం వైసీపీ నేతలు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. పరామర్శించడం మాని.. విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కొంత విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎన్నడూ లేని […]
Tag: ys rajashekarreddy son ys jagan
వైసీపీలో ముందస్తు ఎన్నికల గుబులు
`2019లో కాదు 2018 చివర్లోనే ఎన్నికలు.. అంతా సన్నద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణులకు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధం` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వైసీపీలో మాత్రం `ముందస్తు ఎన్నికలు` టెన్షన్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయంపైనా శ్రేణుల్లో కలవరం మొదలైంది. ప్రజల్లోకి దూసుకెళ్లే నాయకులు నియోజకవర్గాల్లో లేకపోవడం, కలహాలు .. ఇలా పార్టీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇటువంటి […]
ప్రభుత్వం పై వ్యతిరేకత ఇది… దిమ్మతిరిగే రిజల్ట్
ఏపీలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సోమవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మూడు జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో మూడింట మూడు స్థానాలు గెలుచుకోవడంతో అధికార టీడీపీ చేసిన హంగామాకు అంతే లేదు. కడప, కర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీలను టీడీపీ గెలచుకున్నా ఈ గెలుపుకోసం టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులు లెక్కలోకి రాలేదు. ఇక ప్రలోభాలు, బెదిరింపులకు తావులేని టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఫలితాలు కాస్త లేట్‌గా వచ్చాయి. […]
ఆ ఒక్క మాటతో.. జగన్ పరువు తీసేసిన రోజా!
పొలిటికల్ లీడర్లు. మాట్లాడే ప్రతి మాటకీ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడర్ రోజా మాటలకైతే ఇటు పత్రికలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా చేసే ప్రతి కామెంట్‌పైనా రియాక్షన్ కూడా అంతే స్పీడ్‌గా ఉంటోంది. ఇక, తాజా విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో జరిగిన జేసీ బస్సు ప్రమాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున […]
జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన.. కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమవుతోంది. అలాగే ఆయనతో వ్యవహరించిన తీరు ప్రజలతో పాటు పార్టీ నాయకులనే విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ భూషణ్ కూడా జగన్‌కు షాక్ ఇచ్చారు. జగన్‌కు ఎన్ని సలహాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోరని.. తన మొండి వైఖరి తనదే […]
ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు
ఏపీ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను తన పార్టీలో చేర్చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల వారసులు వరుసగా జగన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు కర్నూలు జిల్లాకు […]
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]
టీడీపీకి ఎర్తుపెట్టేలా వైకాపా ప్లాన్లు!
జగన్ నేతృత్వలోని వైకాపా 2019 ఎన్నికలపై దృష్టి పెట్టింది! ఇప్పటి నుంచే సంస్థాగతంగా బలం చేకూర్చుకోకపోతే.. పార్టీ అధికారంలోకి రావడం కష్టమని భావించిన జగన్.. బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టేందుకు పక్కా ప్లాన్లతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వాటిలో ప్రధానమైంది.. టీడీపీ పట్టుకొమ్మలుగా ఉన్న జిల్లాల్లో వైకాపా గాలి వీచేలా చేయడం, రెండోది.. తన పార్టీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వనించడం, […]