జగన్ నేతృత్వలోని వైకాపా 2019 ఎన్నికలపై దృష్టి పెట్టింది! ఇప్పటి నుంచే సంస్థాగతంగా బలం చేకూర్చుకోకపోతే.. పార్టీ అధికారంలోకి రావడం కష్టమని భావించిన జగన్.. బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టేందుకు పక్కా ప్లాన్లతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వాటిలో ప్రధానమైంది.. టీడీపీ పట్టుకొమ్మలుగా ఉన్న జిల్లాల్లో వైకాపా గాలి వీచేలా చేయడం, రెండోది.. తన పార్టీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వనించడం, […]
Tag: YS Jagan
ఈడీ స్పీడ్ చూస్తే … జగన్ కి మళ్లీ జైలు తప్పదా?!
వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ కి మళ్లీ జైలు తప్పదా? ప‌్రస్తుతం ఆయన చుట్టూ మళ్లీ.. జైలు కథలు అల్లుకుంటున్నాయా? 2019 ఎన్నికల కన్నా ముందే ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం ఖాయమా? అంటే ఔననే సమాధానాలే లోటస్‌పాండ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 2011లో కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చిన జగన్ అప్పటి నుంచి అనేక కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయన తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తెరచాటు వ్యవహారాల నేపథ్యంలో జగన్ […]
పవన్ తో పొత్తుకు వైసీపీ తహతహ!
ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైకాపా అధినేత జగన్ ఇప్పుడు జనసేనాని పవన్‌తో పొత్తుకు తహతహ లాడుతున్నారా? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పవన్ పక్కన చేరేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జగన్.. జనసేనానితో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. ముఖ్యంగా వైకాపా ఎంపీ, జగన్‌కి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి నుంచే ఈ విధమైన సిగ్నళ్లు రావడం ఇప్పుడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఇటీవల […]
వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టించాలని గట్టిగా నిర్ణయించుకున్న చంద్రబాబు అండ్ కో కలలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఈ జిల్లా ప్రజలను ఆకట్టుకోవడం కోసం శతథా శ్రమిస్తున్నప్పటికీ.. బాబు పక్షాన నిలబడే వాళ్లు ఎవరూ కనిపించడం లేదనే పరిస్థితి తాజా పరిణామాలతో స్పష్టమైంది! జగన్ ఇలాకాగా పేరు పడ్డ కడపలో వైకాపా అడ్రస్ లేకుండా చేద్దామని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆయనకు తోడుగా ఆయన అనుచరులు కడప టీడీపీ నేతలు […]
వైకాపాలో జగన్ సరికొత్త వ్యూహం
వైకాపాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ప్రజా సమస్యలపై మరింతగా గళం విప్పేలా, రానున్న ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలం పెంచేందుకు జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్రస్తాయి బలం వైకాపాకి లేదు. ముఖ్యంగా మహిళా విభాగం బలహీనంగా ఉంది. పైకి ఒక్క రోజా తప్ప ఎవరూ లేరు. అదేవిధంగా యువజన విభాగం కూడా పెద్దగా యాక్టివ్‌గా లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఈ రెండు విభాగాలను బలోపేతం […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]
జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..
వైకాపా అధినేత జగన్ టైం అస్సలు ఏమీ బాగోలేదని అనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయనను ఆయన జట్టును వీడి చంద్రబాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క.. బలంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వస్తాయోమనని జగన్ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన సొంత జిల్లా కడపకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ.. నిజానికి […]
జగన్-పవన్ భేటీకి డేట్ ఫిక్స్
ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పటి వరకు ఈగైనా వాలకుండా చూసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ఇప్పడు బాబుకు కటీఫ్ చెబుతున్నాడా? 2014లో బాబు పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పవన్.. ఇప్పడు అనూహ్యంగా బాబుకు గుడ్‌బై చెబుతున్నాడా? ఆది నుంచి జగన్ గురించి ఎలాంటి వైఖరినీ చెప్పకుండానే బాబు కు మాత్రమే ఓట్లేయాలంటూ పరోక్షంగా జగన్ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైన పవన్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. నిన్నగాక […]
వ్యూహప్రతివ్యూహాలతో జగన్ సక్సెస్..!
ఏపీలో అధికార, ప్రతిపక్షాల వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాయలసీమ జిల్లాల్లో ఆధిపత్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! కడపలో జగన్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుంటే.. కర్నూలు టీడీపీలో అసంతృప్తులకు జగన్ గేలం వేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు జోరందుకున్న తరుణంలో.. కర్నూలుకు చెందిన టీడీపీ నేతలు కూడా జగన్ చెంత చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా కొత్త సమీకరణాలకు తెరతీసింది! రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా […]