పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]

కేసీఆర్ కల ఇలా తీరుతుందేమో!

పరిశుభ్రమైన హుస్సేన్ సాగర్ ను హైదరాబాదు వాసులకు అందించాలనేది కేసీఆర్ కల. కానీ.. ఆ సాగర్ ఎప్పటికప్పుడు ఘోరంగా తయారైపోతుండడానికి ఉండే అనేక కారణాలలో వినాయక నిమజ్జనం కూడా ఒకటి. ఏటా వందలకొద్దీ వినాయక విగ్రహాలను ఈ హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేస్తుండడం.. దాని పరిశుభ్రతకు పెద్ద సవాలు. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన, ఇనుప కమ్మీలు వాడి తయారుచేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏ […]