న‌య‌న్ ప్లేస్‌లో అనుష్క‌..అంతా చిరు ప్లానేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయ‌నున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్‌ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫ‌ర్‌లో హీరోయిన్ ఉండ‌దు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను […]

వ‌ర్మ న‌యా రికార్డ్‌..దూసుకుపోతున్న `స్పార్క్`!

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు, సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల వర్మ యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరుతో క‌లిసి భారత ఓటీటీ మార్కెట్ లోకి స్పార్క్ అనే ఓటీటీ సంస్థ‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన తాజా చిత్రం డీ కంపెనీ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదటి 12 గంటల్లోనే స్పార్క్ ఓటీటీ […]

అనీల్ రావిపూడిపై వెంకీ ఫ్యాన్స్ గుర్రు..కార‌ణం అదేన‌ట‌?

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ […]

బ‌ర్త్‌డే జోష్‌లో ఫ్యామిలీతో అన‌సూయ ర‌చ్చ..ఫొటోలు వైర‌ల్‌!

బుల్లితెర అందాల యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీవీ షోల‌తో బిజీ బిజీగా ఉండే అన‌సూయ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. నిన్న అన‌సూయ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బ‌ర్త్‌డే వేడుకలు జ‌రుపుకుంది. ఈ బ‌ర్త్‌డే పార్టీలో భ‌ర్త‌, పిల్ల‌లతో ర‌చ్చ ర‌చ్చ చేసింది అన‌సూయ‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు అన‌సూయ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అవి […]

ర‌ష్మిక‌ను ఫాలో అయిన లావణ్య..అత‌డితో అలా..?

మ్యూజిక్ ఆల్బమ్స్ హీరోయిన్లు న‌టించే ట్రెండ్ బాలీవుడ్‌లో త‌ర‌చూ క‌నిపిస్తూనే ఉంటుంది. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ర‌ష్మిక మంద‌న్నా కూడా ఇటీవ‌ల టాప్ టక్కర్ అనే హిందీ ఆల్బమ్‌లో త‌న మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆక‌ట్టుకుంది. అయితే ఇప్పుడు ర‌ష్మికనే ఫాలో అయింది లావ‌ణ్య త్రిపాఠి. ఈ భామ కూడా తమిళంలో పొట్టుమ్‌ పొగట్టుమే పేరుతో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసింది. ఈ వీడియో సాంగ్‌లో అర్జున్ దాస్ తో ఆడిపాడింది. ఈ సాంగ్‌ ప్రోమోను శనివారం […]

అన్న‌కు మ‌రో ఛాన్స్ ఇస్తున్న ప‌వ‌న్ కళ్యాణ్‌?!

లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజ‌యం అందుకుంది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ఓ చిత్రం, ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రం ఇలా వ‌రుస సినిమాలు చేయ‌నున్నాడు. […]

టీవీ షోకు హోస్ట్‌గా విజయ్‌ సేతుపతి..హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!

త‌మిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవ‌లం హీరోగానే కాకుండా విల‌న్‌గా కూడా త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైస్ చేస్తున్నాడీయ‌న‌. ఇటీవ‌ల ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయారు. ప్ర‌స్తుతం ఈయ‌న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇదిలా ఉంటే.. విజ‌య్ వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా సందడి […]

`ఆదిపురుష్` టీమ్‌కు క‌రోనా వ‌రుస‌ షాకులు..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ న‌టిస్తోంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క‌రోనా వ‌రుస షాకులు ఇస్తోంది. ఈ చిత్రం ముంబైలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు […]

అనిల్ రావిపూడి చిత్రంలో బాల‌య్య పాత్ర అదేన‌ట‌!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ.. త్వ‌ర‌లోనే స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా క‌న్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాల‌య్య పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో బాల‌య్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]