టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ‌సూళ్ల దందా ఇలా ఉందా

అవినీతిని అరిక‌ట్టాల్సిన పోలీసులే నేడు అవినీతి బాట ప‌డుతున్నారు. అంటే వారే నేరుగా త‌మ అవ‌స‌రాల కోసం నోట్ల క‌ట్ట‌లు స‌మ‌ర్పించుకునేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఇక‌, స‌మాజంలో ఆద‌ర్శంగా ఉండాల్సిన నేతాశ్రీలు, ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు నోట్ల క‌ట్ట‌ల రుచి మ‌రిగి.. పోలీసుల అవ‌స‌రాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పోలీసుల బ‌దిలీల‌కు రంగం సిద్ధ‌మైంది. రాష్ట్రంలోని ప‌ది జిల్లాల్లోనూ బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో త‌మ‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాల‌కు బ‌దిలీ చేయించుకునేందుకు […]

అక్కడ మాత్రం వద్దు సార్ టైం వేస్ట్

రెండు రాష్ట్రాల్లో బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అందుకు త‌గిన‌ట్టే అడుగులు వేస్తున్నాడు. పార్టీలోకి జ‌న‌సైనికుల‌ను ఆహ్వానించేందుకు ప‌రీక్ష‌లు పెడుతూ.. 2019 ఎన్నిక‌ల‌కు సిద్ధమైపోతున్నాడు. ఈ ప‌రీక్ష‌ల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా త‌ర‌లి వ‌స్తున్నారు యువ‌కులు! ప్రస్తుతం తెలంగాణ‌లోనూ ఈ త‌ర‌హా శిబిరాలు నిర్వ‌హించాల‌న్న ప‌వ‌న్ నిర్ణ‌యంతో ఏపీ జ‌న‌సేన నేత‌లు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. తెలంగాణ‌లో కంటే ఏపీలోనే పార్టీకి ఎక్కువ మైలేజ్ వ‌చ్చే అవ‌కాశ‌ముందని చెబుతున్నారు. తెలంగాణాలో ఇలాంటి శిబిరాల వ‌ల్ల […]

విప‌క్షాల విమ‌ర్శ‌ల నుండి కేటీఆర్ వెనక్కి వెళ్లిపోయాడా?

టీఆర్ ఎస్ స‌హా తెలంగాణ ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ – 2 గా ఉన్న కేటీఆర్ ఇప్పుడు విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు త‌ల‌వంచుతున్నారా? అని అనిపించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 2019 కి సంబంధించి అత్యంత కీల‌క‌మైన నిర్ణ‌యంలో వెనుక‌డుగు వేశార‌ట‌. అదేంటో చూద్దాం.. రాష్ట్రంలో 2019లో ఎలాగైనా స‌రే మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్ వీక్‌గా ఉండి.. టీడీపీ స‌హా ఇత‌ర ప‌క్షాలు బ‌లంగా ఉన్న చోట‌.. ముఖ్య‌నేత‌ల‌ను […]

కేసీఆర్‌కు ఎక్క‌డో టెన్ష‌న్…అది హరీశేనా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో గ‌త రెండేళ్లుగా వార‌స‌త్వ పోరు తీవ్రంగానే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో హ‌రీశ్‌రావుకు ఉన్న ప్రాధాన్యం ఎన్నిక‌ల త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. కేసీఆర్ సైతం అల్లుడు కంటే కొడుకు కేటీఆర్‌కే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో రాష్ట్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన హ‌రీశ్ ఇప్పుడు సిద్ధిపేట‌, మెద‌క్ జిల్లాల‌కు ప‌రిమిత‌మైపోవాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ త‌ర్వాత వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌తో పాటు వ‌రంగ‌ల్ […]

అక్కడ వైసీపీకి దిక్కెవ‌రు?

ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న ప‌లువురిని క‌లిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయ నేత‌ల‌ను ఉక్కిరిబిక్క‌రికి గురి చేస్తోంది. వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేశారా? అంటూ త‌మ‌లో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌కీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డి తెలుగు నేల‌పై సొంతంగా ఏర్ప‌డ్డ పార్టీ కూడా ఇదొక్క‌టే. తాను కోరుకున్న సీఎం ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో […]

మియాపూర్ కుంభ‌కోణం: బ్రోక‌ర్‌గా మారిన ద‌మ్మున్న మీడియా ఎండీ

తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూకుంభ‌కోణం కేసు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ప‌ల్లెత్తు మాట అనేందుకు కూడా ప్ర‌తిప‌క్షాలు సాహ‌సించ‌ని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. మియాపూర్ భూకుంభ‌కోణం ఇష్యూలో టీఆర్ఎస్ నాయ‌కుల పేర్లు ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చాయో అది అక్క‌డ నిద్రాణంగా ఉన్న ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద వ‌రంలా మారింది. దీనిని బేస్ చేసుకుని టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుప‌డుతున్నాయి. ఈ ఇష్యూలో టీఆర్ఎస్ […]

గోల్డ్‌స్డోన్ కుంభ‌కోణంలో ఇద్ద‌రు మాజీ మంత్రులు..?

ఓ వైపు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ దూకుడు ముందు విప‌క్షాల‌న్ని చెల్లా చెదురైపోతున్నాయి. అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం చేతులెత్తేసింది. ఇక అధికార ప‌క్షంలో లోపాలు కాంగ్రెస్ వాళ్ల‌కు ఎలాగూ దొర‌క‌వు..కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై ఏదైనా నెగిటివ్ వార్త వ‌చ్చిన‌ప్పుడు కూడా దానిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేలా ఫోక‌స్ చేసే విష‌యంలో కూడా వాళ్లు ఘోర‌మైన డిజాస్ట‌ర్ షో వేస్తూ ప్లాప్ మీద ప్లాప్ పాలిటిక్స్ చేస్తున్నారు. […]

ఏపీ ఓటు క‌న్నా తెలంగాణ ఓటు వాల్యూ త‌గ్గిందే

తెలంగాణ అధికార ప‌క్షాన్ని ఓ స‌మ‌స్య ఇర‌కాటంలోకి నెట్టింది! ఇది ఏపీతో వ‌చ్చిన స‌మ‌స్య‌కాక‌పోయినా.. ఏపీ వ‌ల్లే వ‌చ్చింద‌ని నేత‌లు దిగులు ప‌డుతున్నారు!! రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా తాము న‌ష్ట‌పోయామ‌ని ఇప్పుడు అనుకుంటున్నార‌ట‌. అయితే, అదేదో.. ఆస్తుల పంప‌కాలు, ఆర్థిక విష‌యాల్లో కాదులెండి. ప్ర‌స్తుతం దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం త‌మ‌కు అనుకూలమైన వ్య‌క్తిని పోటీ లేకుండా నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అన్ని పార్టీలూ రాష్ట్ర […]

తెలంగాణ‌లో బాబు దుకాణం బంద్!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ప‌రిస్థితి మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణంలో మాత్రం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది! జాతీయ పార్టీగా అవ‌త‌రించి.. నేష‌న‌ల్ లెవ‌ల్ లో చ‌క్రం తిప్పాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, అనూహ్యంగా ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప‌క్క‌రాష్ట్రం అందునా హైద‌రాబాద్‌ను నేనే డెవ‌లప్ చేశాన‌ని ప‌దేప‌దే చెప్పుకొనే బాబుకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో పార్టీని నిలుపుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. విష‌యం లోకి వెళ్తే.. తెలంగాణలో టీడీపీ […]