అందితే జుట్టు.. అందకపోతే.. కాళ్లు పట్టుకోవాలి! ఇది ఓల్డ్ సామెత. అయితే, ఇది మన దేశాన్నేలుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్షరాలా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తనకు అవసరమైన వారితో ఎలా పనిచేయించుకోవాలో..? తన అవసరం వస్తే.. ఎలా తప్పించుకోవాలో? మోడీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే నమ్మలేరు. కానీ, పాలిటిక్స్‌లో ఆ మాత్రం జిమ్మిక్కులు చేయకపోతే ఎలా అనేవారూ ఉన్నారు. ఇక, విషయానికి వస్తే.. దేశం మొత్తంమీద ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి, మోడీకి […]
Tag: TDP
పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ విషయంలో సక్సెస్
ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. మంత్రి మాణిక్యాలరావు ఒక్కరే బీజేపీ నుంచి ఉన్నారు. టీడీపీ అంత కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో పాటు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పశ్చిమగోదావరి ఎస్పీ భాస్కర భూషణ్ పనితీరుపై ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి […]
వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి తమ ఫుల్ల్ సపోర్టు ఉంటుందని.. ఎవరిని నిలబెట్టినా తమ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జగన్! రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా.. అంతా అన్ని రాష్ట్రాల నేతలను కోరుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు […]
ఏపీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందా..?
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఆయన ఎప్పుడో కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నోరు విప్పరు. నిన్న చూచాయగా అలాంటి కామెంట్లే చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అంతేకాదు, రాష్ట్ర వృద్ధి చంద్రబాబు చెప్పినట్టు, బడ్జెట్‌లో పేర్కొన్నట్టు 11.61 ఒక్కటే వాస్తవమని మిగిలిన లెక్కలన్నీ చాలా ఇబ్బందుల్లో పడ్డాయని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, గతంలో నిలిపేసిన బిల్లులన్నీ ఒకేసారి చెల్లించాల్సి రావడమే […]
ఏపీ సీఎం పేషీలో ఫైటింగ్
మేధావిగా, ఏ విషయంలోనైనా సబ్జెక్ట్‌ను చూసి స్పందిస్తారనే మంచి పేరున్న ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆధిపత్యం కోసం ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని కొందరు చెబుతున్నారు. ఆ నోటా.. ఈనోటా పాకి ఇప్పుడు ఈ విషయం సీఎం చంద్రబాబు టేబుల్‌కు చేరిందని సమాచారం. విషయం ఏంటంటే.. ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్న పరకాలకు, రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఉన్న వేంకటేశ్వర్లుకు అస్సలు పడడం లేదని ఎప్పటి నుంచో […]
జగన్ కోట్లు పెట్టి తెచ్చుకున్న పీకే.. బాబుకు జై కొడతాడా..?
ఎట్టి పరిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవసం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్న వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో తనకు ఎలక్షన్ సలహాదారుగా ఉత్తరాది నుంచి కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రశాంత్ కిశోర్‌ను దిగుమతి చేసుకున్నాడు. వచ్చీ రావడంతోనే ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సినారియో మీద ఓ సర్వే చేయించాడు. ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాలు, జనసేనాని దూకుడు.. కాంగ్రెస్ వామపక్షాల గాలి వంటి వివిధ అంశాలపై ఆయన తన దైన స్టైల్‌లో […]
టీడీపీలో నేడు ఐవైఆర్…రేపు వేటు ఎవరిపైనో..!
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావుపై ప్రభుత్వం వేటు వేయడం టీడీపీ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ వాళ్లు పెడుతోన్న పోస్టులను షేర్ చేస్తున్నారన్న కారణంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. కృష్ణారావుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసిన ప్రభుత్వం ఆ స్థానంలో కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనందసూర్యను నియమించింది. ఏదేమైనా చంద్రబాబు గీత దాటుతోన్న, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటోన్న వారి […]
అప్పట్లో పరకాల, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు మేధావుల అవసరం ముఖ్యం! ఇది గమనించే కొంతమందిని కీలక పదవుల్లో నియమిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి రివర్స్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఇలాంటి పరిణామమే ఏపీ రాజకీయాల్లో ఎదురైంది. సీఎం చంద్రబాబు.. ఏరికోరి నియమించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్రభుత్వంపై ఎదరుదాడికి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయనపై వేటు వేసే వరకూ వ్యవహారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘటనే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో […]
పక్కలో బల్లెంపై చంద్రబాబు వేటు
ఈ రోజు ఉదయాన్నే చంద్రబాబు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్‌పై వేటు వేశారు. ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు గత రెండు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తోన్న వార్తలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు చంద్రబాబు, టీడీపీనే టార్గెట్ చేసే పోస్టులను ఆయన పెడుతూ పెద్ద సీతయ్యగా మారారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే ఆయనపై వేటు వేసిన చంద్రబాబు ఏపీ […]