ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో […]

పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటు` ఎంత మందిని ముంచేసిందో తెలుసా?

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) శుక్ర‌వారం గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయ‌న అక్క‌డే తుదిశ్వాస విడిచి.. యావత్‌ చిత్ర పరిశ్రమను, అభిమానుల‌ను శోకసంద్రంలోకి ముంచేశారు. అయితే పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటుతో హఠాన్మరణం` ఆనవాయితీగా వస్తోంది. అవును.. పునీత్ తండ్రి, లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ క‌న్న‌డ చిత్ర పరిశ్రమను కొన్ని ఏళ్లపాటు ఏలారు. […]

మ‌ర‌ణంపై పునీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను హుఠాహుఠిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి అప్ప‌టికే చేయి దాట‌డంతో చికిత్స పొందుతూనే పునీత్ తుదిశ్వాస విడిచారు. ఇక పునీత్ మ‌ర‌ణం యావ‌త్‌ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయన భవిష్యత్తు గురించి, మ‌ర‌ణం గురించి చేసిన ఆస‌క్తిక‌ర […]

పునీత్ మ‌ర‌ణించినా.. ఆయ‌న క‌ళ్లు మ‌న‌ల్ని చూస్తూనే ఉంటాయి!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో హఠాన్మరణం చెంద‌డాన్ని ఎవ్వ‌రూ జీర్ణియించుకోలేక‌పోతున్నారు. నేటి ఉద‌యం జిమ్‌ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో హుఠాహుఠిన విక్రమ్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఇక అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. తుది శ్వాస విడిచారు. అయితే పునీత్ మ‌ర‌ణించినా.. […]

షాకింగ్ న్యూస్‌..ప‌వ‌ర్ స్టార్‌కు గుండెపోటు..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గుర‌య్యారు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబస‌భ్యులు హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయ‌న‌కు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న […]

ప్రముఖ హాస్య‌న‌టుడు మృతి..శోక‌సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌..!!

గ‌త కొంత కాలం నుంచీ సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంట‌న్నాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుండటం తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. తాజాగా ప్ర‌ముఖ క‌న్నడ హాస్యనటుడు శంకర్‌ రావు సోమవారం ఉదయం బెంగళూరుతో మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 88 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత కాలం నుంచీ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న‌..స్వ‌గృహంలోనే తుది శ్వాస విడిచారు. పాప పాండు సీరియల్‌ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం […]