ప‌వ‌న్ కూడా రెడీ..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు పాద‌యాత్ర‌లు బాగానే క‌లిసొస్తున్నాయి. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు సోద‌రి ష‌ర్మిల పాద‌యాత్ర చేసినా ఆమె పాద‌యాత్ర‌కు జ‌నాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత ప్లీన‌రీ సాక్షిగా తాను పాద‌యాత్ర‌కు రెడీ […]

జ‌న‌సేన టాపిక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సీరియ‌స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంద‌రితోను చాలా క‌లుపుగోలుగా ఉండ‌డంతో పాటు అంద‌రిని ఆద‌రిస్తార‌న్న స‌ద‌భిప్రాయం ఆయ‌న‌పై అంద‌రికి ఉంది. ప‌వ‌న్ ఏ విష‌యంలోను ఎవ్వ‌రిని నొప్పించ‌కుండా ఉంటారు. అయితే అలాంటి ప‌వ‌న్‌కు ఓ వ్య‌క్తి చాలా కోపం తెప్పించ‌డంతో పాటు ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురయ్యాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]

జ‌న‌సేన స‌ర్వే నిజ‌మా..?  కామెడీనా…?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 83 సీట్లు గెలుస్తుందంటూ జ‌న‌సేన అభిమాని నిర్వ‌హించిన స‌ర్వేలో తేల‌డం ఇప్పుడు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ ప‌డుతూ ఉన్న స‌మ‌యంలో.. ఈ స‌ర్వే రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయ‌కులు, ఇటు విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ స‌ర్వే నిజ‌మా? అబ‌ద్ద‌మా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణ‌మే పూర్తిగా లేని జ‌న‌సేన‌కు […]

ప‌వ‌న్ మానియా ఎలా ఉందో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్టామినా ఏంటో ఆయ‌న తాజా సినిమా మ‌రోసారి స్ప‌ష్టం చేస్తోంది. ప‌వ‌న్‌కు ఎన్ని ప్లాపులు వ‌చ్చినా క్రేజ్ త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. ప‌వ‌న్‌కు అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత స‌రైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావ‌రేజ్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు సినిమాలు రెండూ డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బ‌తో బ‌య్య‌ర్లు భారీ న‌ష్టాలు చూశారు. అయినా ప‌వ‌న్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం దిమ్మ‌తిరిగే […]

పవన్ సర్వే ఏ పార్టీకి?

2019 ఏపీలో ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అనే థీమ్‌తో ఇటీవ‌ల ఆయ‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల స‌ర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక‌, ప్ర‌శ్నిస్తానంటూ […]

జ‌న‌సేన‌లో క‌న్నాకు ప్ర‌త్య‌ర్థి రెడీ..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి! విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు అత్యంత కీల‌కంగా మారిన గుంటూరులో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని పవ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఎలా ఉంటుందో తెలియ‌దుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజ‌కీయ పార్టీల నేత‌లకు మాత్రం క‌ల్ప‌త‌రువుగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయ‌కులు వేచిచూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో గుంటూరు రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]

జ‌న‌సేన‌కి వారే పెద్ద ఆస్తి అవుతారా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. అదేసమ‌యంలో తాను అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ వెల్ల‌డించాడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నెత్తురు మండే క‌త్తుల్లాంటి యువ‌త‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించి.. ఇప్ప‌టికే జిల్లాల వైజ్‌గా యువ‌త‌ను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హిస్తున్నాడు. వాస్త‌వానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే ప‌వ‌న్ ఫాలో అవుతున్నాడ‌ని స‌మాచారం. యువ‌కుల‌కు […]

`తూర్పు`లో జ‌న‌సేన‌లోకి భారీ జంపింగ్‌లు

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌దు గానీ.. నేత‌లు మాత్రం ఆ పార్టీలో చేరాల‌ని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జ‌న‌సేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సామాజిక‌వర్గం బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇప్పుడు నేత‌లంతా ప‌వ‌న్ స‌ర‌స‌న చేరేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజ‌ర్వేష‌న్ […]

క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ దెబ్బేశాడుగా! 

త‌న‌కు క‌మ్యూనిస్టులంటే గౌర‌వం ఉంద‌ని, వాళ్ల భావ‌జాలం.. త‌న భావ‌జాలంలో సారూప్య‌త ఉంద‌ని.. అవ‌స‌ర‌మైతే వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకైనా సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వ‌స్తున్నాడు. దీంతో క‌మ్యూనిస్టులు కూడా ప‌వ‌న్ త‌మ‌తో దోస్తీక‌డ‌తాడ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. అయితే వారికి ప‌వ‌న్‌.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని, ఇందుకు ప‌వ‌న్ కూడా తోడ‌యితే త‌మ‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని భావించిన క‌మ్యూనిస్టుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. […]