స‌మంత‌పై మండిప‌డుతున్న తమిళియన్స్..ఏం జ‌రిగిందంటే?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌పై త‌మిళియ‌న్స్ మండిప‌డుతున్నారు. అందుకు కార‌ణం ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలరే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో స‌మంత కూడా కీల‌క పాత్ర పోషించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న […]

చంపుతానంటున్న‌ స‌మంత‌..అదిరిన ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్‌!

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందుతుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో.. సమంత అక్కినేని టెర్రరిస్టుగా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే పలుమార్లు ఈ సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను జూన్ […]

ఓటీటీలో `పాగ‌ల్‌`..క్లారిటీ ఇచ్చేసిన విష్వక్ సేన్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం పాగ‌ల్‌. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే ఛాన్స్ […]

క‌రోనా దెబ్బ‌కు పూరీ త‌న‌యుడు కీల‌క నిర్ణ‌యం..?

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. కేతికా శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వాస్త‌వానికి ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, […]

బిగ్ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్..అస‌హ‌నంలో కస్టమర్లు!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలు కూడా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇక థియేట‌ర్లు తెరుచుకున్నా ఓటీటీల క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోకు కూడా ఓటీటీ ప్లాట్ ఫాంలలో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు, క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అందించింది. దీంతో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకుని ఎంజాయ్ చేసే వారు. అయితే ఇప్పుడు […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా?

శివ మనసులో శృతి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. కొత్త జంట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, ప్ర‌స్తుతం రెజీనా కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రెజీనాకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. దీంతో హీరోయిన్‌గా కాకుండా విల‌న్‌గా కూడా ప‌లు చేత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ అమ్మ‌డు గ్రాఫ్ పెర‌గ‌లేదు. రెజీనా ప్ర‌స్తుతం తెలుగులో నేనేనా అనే […]

ఓటీటీలో వ‌స్తున్న‌ `ఏక్ మినీ కథ`..భారీ ధ‌ర‌కే అమ్మేశారుగా?!

యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ క‌థ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే క‌రోనా కార‌ణంగా ఏ […]

ఓటీటీలోకి నితిన్ `చెక్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

చంద్రశేఖర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా న‌టించారు. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ క‌థ‌. ఇటీవ‌లె థియేట‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్ప‌డు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]

చిరు-వెంకీ కీల‌క నిర్ణ‌యం..అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రూ సీనియ‌ర్ హీరోలే అయినా వ‌రుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. క‌రోనా దెబ్బ‌కు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]