నందమూరి నటసింహం బాలయ్యకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక రామారావు నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరస బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక నందమూరి బాలయ్య తనయుడుగా మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్‌గా చేశారు మేకర్స్. […]