ప్రధాని నరేంద్ర మోడీ అసలు రూపం బట్టబయలైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్రజల్లో ప్రచారం చేయించుకున్న పవన్ కల్యాణ్‌ను ఆయన గడ్డి పరకలా పక్కన పెట్టేశారు. పట్టుమని మూడేళ్లు కూడా తిరగకుండానే.. ఒకే వేదికను పంచుకుని ప్రజల్లోకి వెళ్లిన నేతను నిలువునా అవమానించారు. అసలు ఏపీలో పవన్ అనే వ్యక్తి ఉన్నాడన్న తలంపు కూడా లేకుండా వ్యవహరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్యక్రమం జోరుగా సాగుతోంది. అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు ఇది […]
Tag: Modi
ఏపీలో మోడీ బొమ్మ వర్సెస్ బాబు బొమ్మ
సోము వీర్రాజు! ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్రపక్షం నేత. టీడీపీ-బీజేపీల మిత్రపక్షాలే అయినప్పటికీ.. సోము ఆవేశం, ఆవేదన మాత్రం.. విపక్షం మాదిరిగానే ఉంటోంది. తమను టీడీపీ అధినేత కరివేపాకులా చూస్తున్నారని, తమకు విలువ లేదని, ఆయనకు చెక్కభజన చేసేవాళ్లనే పట్టించుకుంటున్నాడని పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సోము.. అసలు టీడీపీతో బంధం వద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖలు రాసి, కార్యకర్తలతో ప్రదర్శనలు సైతం ఇప్పించాడు. దీనికి కారణం పైన చెప్పుకొన్నట్టు.. టీడీపీ […]
భారత్‌లో బుల్లెట్ ట్రైన్..మోడీకి విమర్శల వెల్లువ!
భారత్‌లో బుల్లెట్ ట్రైన్ వస్తోంది. త్వరలోనే ఈ ట్రైన్ పట్టాల మీదకి కూడా ఎక్కబోతోంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కావడం, అది కూడా ప్రముఖ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్) దక్కించుకోవడం ఒక పక్క ఆనందం కలిగిస్తోంది. రూ.1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జపాన్ సాయంతో పూర్తి చేయనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్- మహారాష్ట్రలోని ముంబైల మధ్య ఈ ట్రైన్ పరగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కూడా గురువారం అహ్మదాబాద్‌లో […]
ఈ డబుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!
రాజకీయాలన్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్రమాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణలోని రాజకీయ పండితులు. తమకు తామే మేధావులమని, తమను మించిన వారు లేనేలేరని, పాలనా దక్షత మాకే ఉందని ఇటీవల కాలంలో ఆగకుండా అందకుండా డప్పు బజాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణలో అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చినా ఇక్కడి టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీ […]
ఏపీని అందుకే.. కేంద్రం పట్టించుకోవడంలేదా..!
అవునా? నిజమేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రం మునిగిపోవడం ఖాయమేనా? రాష్ట్రం అప్పుల పాలవడం నిజమేనా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖరిపై మిత్ర పక్షం బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని ఈ పరిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్నరలో కష్టాలు మరిన్ని పెరుగుతాయని అంటున్నారు. విషయం ఏంటో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లింది. ప్రజల […]
ఏపీని కేంద్రం ముంచేస్తోందా?
రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే.. సమాఖ్య వ్యవస్థ బాగుండాలి! అంటే కేంద్రం రాష్ట్ర సంబంధాలు బాగుండాలి. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో మరో పార్టీ ప్రభుత్వం ఉంటే ఈ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి నానాటికీ తీసికట్టుగానే మారుతుంది. అదే, కేంద్రం, రాష్ట్రాల్లో ఏక పార్టీ ప్రభుత్వం ఉంటే.. చాలా బెటర్. అవసరానికి కేంద్రం నిధులివ్వడమే కాకుండా.. అన్ని విషయాల్లోనూ వెనుకేసుకు వస్తుంది. ఇటీవల జరిగిన యూపీ చిన్నారుల మృతులు, హరియాణాలో డేరా బాబా […]
మోడీ కేబినెట్ ప్రక్షాళన ఏపీకి లాభమా… నష్టమా..!
ఇప్పుడు అటు ఢిల్లీలోను, ఇటు అమరావతిలోనూ ఆ వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ తన కేబినెట్ విస్తరణను చేపడితే.. బాబుకు లాభం ఎలా? నష్టం ఎలా ? అనే అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇప్పుడు ఈ చర్చకు ఎందుకు అవకాశం వచ్చింది? మరే రాష్ట్రంలోనూ లేని ప్రభావం కేంద్ర కేబినెట్ ఏపీపై ఎలా చూపుతుంది? అంటే.. బాబు మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం ఏపీ మూడేళ్ల పసిపిల్ల. దీనికి కేంద్రం నుంచే ఆలన, […]
కేంద్రంలో కొత్త మంత్రుల హిస్టరీ ఇదే..
కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్లలో ముచ్చటగా మూడోసారి కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీరబోతున్న మంత్రులకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాలకు మోడీ తన టీంలో చోటు కల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్రత్యేకతలున్నాయి. మరి అవేంటో చూద్దాం.. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా […]
నంద్యాలలో టీడీపీ గెలుపుపై మోడీ ట్వీట్‌లో మెలిక ఏంటి
నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఈ ఉప పోరుకు సంబంధించి జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున ప్రచారం చేసింది. ముఖ్యంగా చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద కామెంట్లు నేషనల్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దేశానికి రాష్ట్రపతి, ప్రధానులుగా చేసిన వారిని ఎన్నుకున్న ఈ నంద్యాల ప్రజలపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఇక్కడి […]