మోడీ మెగా ప్లాన్‌: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!

2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించి ఢిల్లీ పీఠం వ‌రుస‌గా రెండోసారి అధిష్టించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో మోడీ అనుస‌రించిన వ్యూహానికి విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌కు తావే లేకుండా పోయింది. దీంతో ఆయ‌న‌తో విబేధించే మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి మోడీ క‌ల్పించారు. ఇక్క‌డ ఎవ్వ‌రు విమ‌ర్శించినా ద‌ళితుడు రాష్ట్ర‌ప‌తి అవ్వ‌డం ఇష్టం లేదా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. […]

ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్‌లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌న్నీ.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్థానంలో మ‌రో కొత్త‌వారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హ‌స్తిన రాజ‌కీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్క‌డే బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీల వ్యూహం వ్యూహాత్మ‌కంగా సాగుతోంది! క‌ర‌డుగ‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్ద‌రూ త‌మ‌కు అనుకూలురైన వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కూర్చోపెట్టాల‌ని భావిస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్డీయే […]

బీజేపీని తొక్కే ప‌నిలో చంద్ర‌బాబు బిజీ

ఏపీలో మిత్రప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం స‌ఖ్య‌త లేద‌న్న‌ది రాజ‌కీయ ఓన‌మాలు తెలిసిన వాళ్ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్ర‌స్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాప‌కింద నీరులా బీజేపీ ఇక్క‌డ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో పొత్తు ఎలా ఉన్నా అప్ప‌టి వ‌ర‌కు […]

బ‌ళ్లారిలో గాలి ఫ్యామిలీకి చెక్‌

క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి జిల్లా పేరు చెపితే మాజీ మంత్రి గాలి జనార్థ‌న్‌రెడ్డి పేరు ముందుగా గుర్తుకు వ‌స్తుంది. బ‌ళ్లారి మైనింగ్ మాఫియాతో కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కిన గాలి కేవ‌లం మంత్రిగా ఉండి క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌ను శాసించారు. అక్ర‌మాస్తుల కేసులో అరెస్టు అయ్యి గాలి జైలుకు వెళ్ల‌డంతో అక్క‌డ గాలి ఊపు త‌గ్గింది. ఇక వ‌చ్చే యేడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో మ‌రోసారి గాలి బ‌ళ్లారిలో కీ రోల్ పోషిస్తాడా ? అన్న చ‌ర్చ‌లు […]

విశాఖ‌పై బీజేపీ క‌న్ను! 

విశాఖ‌.. ఏపీలోని అత్యంత సుంద‌ర‌మైన టూరిస్ట్ ప్లేస్‌. అంతేకాదు… కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అనేక పెద్ద పెద్ద ఇండ‌స్ట్రీలు ఇక్క‌డే ఉన్నాయి. అంతేకాకుండా విశాఖ విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా, న‌గ‌రాన్ని ప్ర‌ఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా తీర్చి దిద్దుతున్నారు. దీంతో ఇప్పుడు క‌మ‌ల ద‌ళాధిప‌తుల‌కు ఉక్కు న‌గ‌రంపై మిక్కిలి ప్రేమ ఒలికిపోతోంది! త‌మ‌కు ఏపీలో అత్యంత క‌లిసొచ్చే న‌గ‌రం ఏదైనా ఉంటుందంటే అది విశాఖే న‌ని వాళ్లు చెప్పుకొంటున్నారంట‌! ఈ నేప‌థ్యంలో మొన్న తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన […]

తమిళనాడులో పాగా వేసేందుకు మోడీ స్కెచ్ ఇదేనా!

త‌లైవా ర‌జ‌నీకాంత్ రేపో మాపో పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. అన్నీ రెడీ కూడా అయిపోయాయి. పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ తెర వెన‌క శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ర‌జ‌నీ ర‌మ్మంటే వ‌చ్చేసేందుకు కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమిళ‌నాడులో రెడీగా కూడా ఉన్నారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ర‌జ‌నీ ఏ రేంజ్‌లో వ‌స్తున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, ర‌జ‌నీ ఏర్పాటు చేయ‌బోతున్న పార్టీ కోసం బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ చాలా […]

తెలంగాణ‌లో క‌మ‌ల నాథుల క‌ల‌లు నెర‌వేరేనా?!

ఉత్త‌రాదిలో త‌మ ప‌ట్టును నిలుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు 2019లో జ‌ర‌గ‌బోయే ఏపీ, తెలంగాణ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. ద‌క్షిణాదిలో ఒక్క కర్ణాట‌క‌లో త‌ప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉండ‌డంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై దృష్టిపెట్టిన బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీలు.. అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌లో నూ తాము సొంతంగా ఎద‌గాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణలో తొలి మూడు రోజులు ప‌ర్య‌టించిన అమిత్ షా త‌న ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసుకునేందుకు […]

షా కామెంట్ల‌తో మోడీకి కేసీఆర్ ఝ‌ల‌క్‌!!

పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత‌! అచ్చు ఇప్పుడు ఈ సామెత‌నే ఒంట బ‌ట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన బీజేపీ సార‌ధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయ‌న పాల‌న‌పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ల‌క్ష కోట్ల‌కు పైగా ఇచ్చామ‌ని, అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, అయినా ఎక్క‌డా రాష్ట్రంలో అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని అన్నారు. నిజానికి తెలంగాణ‌పై ఎవ‌రు ఏ […]

బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]