హోదాపై ఎన్నెన్ని మాటలు చెప్పారు! ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! తర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. నమ్మించి నట్టేట ముంచారు బీజేపీ నేతలు! ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ఇవే మాయ మాటలు చెబుతున్నారు! తమ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా.. ఏపీ ప్రజల […]
Tag: Modi
మోడీ టీడీపీకి దూరంగా..వైసీపీకి దగ్గరగా దేనికి సంకేతం!
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకూ శత్రవులుగా ఉన్న నేతలు.. ఇప్పుడు కత్తులు దూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి టీడీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. తమ పార్టీనేతలకు ఎన్నో గంటలు, రోజులు వేచిచూస్తేనే గాని దక్కిన మోడీ అపాయింట్‌మెంట్.. వైసీపీ నేతలకు క్షణంలోనే దక్కడంపై వీరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత జగన్.. ప్రధాని మోడీతో భేటీ అయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు […]
టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంద్రి నరేంద్రమోడీపై ఎక్కడా లేని భక్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయన పూర్తిగా ఆకట్టేసుకున్నట్టే కేసీఆర్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పనిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలను కలుస్తూ మద్దతు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలోని విపక్ష వైసీపీ మద్దతు […]
టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన మోదీ
మిత్రపక్షం మాటలు గాలిలో కలుస్తున్నాయి. మిత్ర ధర్మానికి బీటలు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మధ్య బంధం బలోపేతం అవుతోంది. కమలం చెంతకు ఫ్యాన్ క్రమక్రమంగా దగ్గరవుతోంది. ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కలయితతో బీజం పడిన స్నేహ బంధం.. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరింత చిగురించింది. రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు వైసీపీకి కూడా ఆహ్మానం అందడం.. ఏపీలో మరోసారి […]
ఇద్దరు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?
ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల వైఖరే డిఫరెంటు. ఈ ఇద్దరూ అవసరాన్ని బట్టి తిట్టుకోవడం, అవసరాన్ని బట్టి పొగుడుకోవడం పరిపాటైంది. నిన్న మొన్నటి వరకు కృష్ణా వాటర్ విషయంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి నామినేష్ ఘట్టానికి వెళ్లిన సందర్భంలో మాత్రం చిరునవ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవరికివారే సొంత లాభం లేకుండా […]
మోడీ ప్రసన్న కోసం వెంకయ్య ఏదైనా చేస్తాడా..!
ప్రధాని మోడీ పరమ వీర విధేయులైన భక్తుల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. ఆయన మెప్పు పొందడానికి నిరంతరం, అహర్నిశలు, పగలురాత్రి అన్న తేడా లేకుండా శ్రమిస్తూ ఉంటారు. సందర్భం దొరికిన ప్రతిసారీ మోడీని.. దేశ ప్రజలను కాపాడటానికి వచ్చి దైవదూతగా అభివర్ణిస్తూ.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇందుకోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను తృణప్రాయంగా విడిచిపెట్టేస్తారు. హిందీని మరోసారి ప్రవేశపెట్టే యత్నాలకు వెంకయ్య జతకలిశారు. మోడీని హీరో చేయడం కోసం సొంత భాషను గుజరాత్ […]
పైసా ఖర్చేలేదు.. మోడీ బాబు ను తెగ వాడేస్తున్నాడన్నమాట!!
అందితే జుట్టు.. అందకపోతే.. కాళ్లు పట్టుకోవాలి! ఇది ఓల్డ్ సామెత. అయితే, ఇది మన దేశాన్నేలుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్షరాలా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తనకు అవసరమైన వారితో ఎలా పనిచేయించుకోవాలో..? తన అవసరం వస్తే.. ఎలా తప్పించుకోవాలో? మోడీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే నమ్మలేరు. కానీ, పాలిటిక్స్‌లో ఆ మాత్రం జిమ్మిక్కులు చేయకపోతే ఎలా అనేవారూ ఉన్నారు. ఇక, విషయానికి వస్తే.. దేశం మొత్తంమీద ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి, మోడీకి […]
వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి తమ ఫుల్ల్ సపోర్టు ఉంటుందని.. ఎవరిని నిలబెట్టినా తమ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జగన్! రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా.. అంతా అన్ని రాష్ట్రాల నేతలను కోరుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు […]
మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జగన్
ప్రత్యేకహోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకునపెట్టే అవకాశాన్ని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వచ్చేది లేదని, అందులో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామని మభ్యపెడుతున్న వైసీపీ.. తమకు ఏపీ ప్రజల ప్రయోజ నాల కంటే తమ సొంత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ తలాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు […]