సిద్ధార్థ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత తెలుగులో ఏవో కొన్ని సినిమాలే చేశాడు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం ఫుల్ బిజీ అయ్యాడు. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం మరచిపోయాడు. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత `మహాసముద్రం` సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సిద్ధార్థ్.. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంలో సిద్ధార్థ్, […]
Tag: Latest news
ఆ రేర్ రికార్డుపై వెంకీ కన్ను..అల్లాడిపోతున్న కుర్రహీరోలు!?
సాధారణంగా ఓ సినిమా పూర్తి చేయాలంటే మూడు, నాలుగు నెలలు పడుతుంది. అదే పెద్ద సినిమా అయితే ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది. ఐదు సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కావు.. కేవలం ముప్పై రోజుల్లోనే సినిమా పూర్తి రేర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే `నారప్ప` సినిమాను పూర్తి చేసిన వెంకీ.. ఆ వెంటనే ఎఫ్3 సెట్స్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా […]
మళ్లీ సాయిపల్లవినే కావాలంటున్న యంగ్ హీరో..ఒప్పుకుంటుందా?
సాయిపల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.`ఫిదా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయిపల్లవి..మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. ఇక కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి, నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడుకు మరో ఆఫర్ వచ్చిందంట. […]
మెగా హీరోకు సాయం చేస్తున్న సుకుమార్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
ఆకట్టుకుంటున్న సందీప్ కిషన్ `గల్లీ రౌడీ` ఫస్ట్ లుక్!
ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ ప్రస్తుతం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో `గల్లీ రౌడీ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా..బాబీ సింహా, నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ నందినీ […]
ఏపీలో కరోనా వీరవిహారం..నిన్నొక్కరోజే 1,730 కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు చేరువలో నిలిచాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
వారిపైనే ఆశలు పెట్టుకున్న నందమూరి హీరో..హిట్ కొట్టేనా?
`శ్రీమంతుడు` సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాత సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇక ‘ఉప్పెన’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవలె నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా […]
ఎట్టకేలకు నెరవేరబోతున్న చిరంజీవి కల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?
ఎట్టకేలకు చిరంజీవి కల నెరవేరబోతుందట. అది కూడా కొడుకు రామ్ చరణ్ ద్వారానట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలు చేస్తున్న రామ్ చరణ్.. త్వరలోనే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]
మహేష్ సినిమాపై కరోనా దెబ్బ..వెనక్కి తగ్గిన చిత్రయూనిట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వాటి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి కరోనా దెబ్బ తగిలిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ […]