ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న ఏడు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
Tag: Latest news
నటుడు వివేక్ హఠాన్మరణంపై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు!
కోలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ నేటి ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వివేక్.. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే వివేక్ హఠాన్మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని.. ఎంతో బాధ […]
మరో బాలీవుడ్ డైరెక్టర్‌కు ప్రభాస్ గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే ప్రకటన?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్`, కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో `సాలర్` మరియు నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాడు. అంతేకాదు.. సలార్, ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాడు. అయితే తాజా సమాచారం ప్రకారం..మరో ప్రాజెక్ట్‌ను ప్రభాస్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు […]
అశోకవనంలో టాలీవుడ్ యంగ్ హీరో `కళ్యాణం`!
`ఈ నగరానికి ఏమైంది` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. `ఫలక్ నామా దాస్` సినిమాతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన `పాగల్` అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిఫరెంట్ టైటిల్‌తో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. అదే `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ […]
భారత్‌లో కొత్తగా 2.34 లక్షల కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,34,692 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,26,609 కు చేరుకుంది. అలాగే నిన్న 1,341 మంది […]
తెలంగాణలో కరోనా విశ్వరూపం..4 వేలకు పైగా కొత్త కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
పవన్‌కు కరోనా..వర్మ ఘాటు వ్యాఖ్యలు!
ప్రాణాంతక కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. అయితే పవన్‌కు కరోనా సోకడం పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ` ఒక కనిపించని నీచమైన పురుగు కూడా […]
డ్యాన్సర్‌గా మారిన సింగర్ సునీత..వీడియో వైరల్!
టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సింగర్‌గానే కాకుండా టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది సునీత. ఇక ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సునీత.. ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సింగర్ డ్యాన్సర్‌గా మారబోతోంది. ఎప్పుడూ గాత్రం మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తూ రికార్డింగ్ […]
`ఆచార్య` రిలీజ్ డేట్‌పై కన్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఆచార్య రిలీజ్ డైట్‌పై కన్నేశారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం […]