తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా నష్టపోయింది టీడీపీనే! అలాగే ఇప్పటికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్యవహారం బయటపడిన దగ్గర నుంచి టీఆర్ఎస్-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి మారిపోయింది, మరి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ కలిసి పనిచేస్తాయని కలలో కూడా ఊహించలేం కదా! కానీ ఇప్పుడు ఇలాంటి పరిణామాలు రాబోతున్నాయట! వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ […]
Tag: KCR
అటు కేసీఆర్.. ఇటు కోదండరాం.. డైలమాలో దేవీ ప్రసాద్!
తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మంది ఉద్యోగులను ఒక్కమాటతో కదిలించిన నేత, ఉద్యమానికి ఉద్యోగుల సైడ్ నుంచి ఊపిరులూదిన నేత దేవీప్రసాద్ భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందట! కేసీఆర్‌ను నమ్ముకుని తెలంగాణ ఉద్యమం అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆయన తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. అయితే, అనంతరం ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించలేకపోయారు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అయితే, తనను కేసీఆర్ పట్టించుకుంటారని, పార్టీలో ఏదన్నా పదవిని ఇస్తారని దేవీ భావించారు. అయితే, కేసీఆర్ నుంచి […]
టీ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా కారణాలు ఇవే!
తెలంగాణలో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న శాఖ ఏదైనా ఉందంటే అది.. వైద్య, ఆరోగ్య శాఖ! ప్రభుత్వాసుపత్రు ల్లోనే వైద్యం చేయించుకోవాలని ఒకపక్క ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. మరోపక్క ఆ ఆసుపత్రుల్లో మరణాలు ప్రభుత్వానికీ, ఆ శాఖ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి కష్టాలు తప్పడం లేదు! ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాలింతల మరణాలు, నీలోఫర్ ఆసుపత్రుల్లో చిన్నారి ప్రవళిక మృతితో వైద్య శాఖ తీవ్రంగా […]
తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్‌లో చేర కేసీఆర్ మన్ననలు పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు, కేసీఆర్ వెన్నంటే నడుస్తూ ఉన్న జగదీశ్వర్ రెడ్డికీ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమయింది. తనకు ప్రాధాన్యం తగ్గిస్తూ.. తుమ్మలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, తన జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడంపై జగదీశ్వర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతుననారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ […]
చంద్రబాబును దాటేసిన కేసీఆర్ వృద్ధి లెక్కలు!
దేశంలో ఓ పక్క నోట్ల రద్దు దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలూ ఇబ్బందుల్లో పడ్డాయి. అంతేకాదు, నోట్ల రద్దుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆరోపించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చారు. అయితే, తాజాగా ఆయన లెక్కలు కూడా మార్చారనే విమర్శలు వస్తున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వృద్ధి […]
గులాబీ దళంలో ఎమ్మెల్సీ గుబులు
గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ముచ్చట మొదలైంది. ఇప్పటివరకూ పార్టీలో ఉన్న వారు.. కొత్తగా ఎన్నో ఆశలతో పార్టీలతో చేరిన వారితో ఆశావహుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. రానున్న నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎవరి స్థాయిలో వారు అప్పుడే పైరవీలకు తెరతీశారు. తమకూ అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత వద్దకు క్యూ కడుతున్నారు. […]
ఆ ఒక్కడే కేసీఆర్ కు కంట్లో నలుసు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నానాటికీ సంస్థాగతంగా బలోపేతం అవుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు రెట్టింపు స్థాయిలో బలహీనపడుతున్నాయి! కేసీఆర్ ఢీ కొట్టాలని పార్టీలు, నాయకులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమ వుతున్నాయి! ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలు కేసీఆర్‌ను పదేపదే విమర్శిస్తున్నా వారిలో లుకలుకలు, కలహాలు మాత్రమే కనిపిస్తున్నాయి! అయితే ఒకే ఒక్కడు మాత్రం కేసీఆర్‌ను ఢీకొట్టే స్థాయిలో చెలరేగిపోతున్నాడు! కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా, కంట్లో నలుసులా మారిపోయాడు! అతడే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ […]
కేసీఆర్ ఆత్మకథలో ఏముంది..!
తెలంగాణ ముద్దుబిడ్డ.. సీఎం కేసీఆర్.. తన రాజకీయ జీవితానికి సంబంధించి ఆత్మకథను అక్షర రూపంలో వెలుగులోకి తెస్తున్నారట. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆత్మకథలు రాయడం, పుస్తక రూపంలో తీసుకురావడం కొత్తకాదు. మహాత్మా గాంధీ మొదలుకుని అనేక మంది మేధావులు, మహాత్ములు పుస్తకాలు రాశారు. కానీ, కేసీఆర్ కి వాళ్లకి భిన్నమైన వాతావరణం ఉంది. సొంత దేశంలో స్వపరిపాలన కోసం చేసిన పోరుగా కేసీఆర్ సాగించిన తెలంగాణ ఉద్యమం నేడు చరిత్ర పాఠమైంది! […]
బాబు-కేసీఆర్‌లలో గవర్నర్ ఎవరిపక్షం..!
రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్‌ది టాక్‌గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా […]