తెలంగాణలో తనకు ఎదురు నిలిచే నాయకుడే లేకుండా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. ఒక ప్రొఫెసర్ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు! తన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చిత్తు చేసిన గులాబీ దళపతి పాచికలు.. ఆయన ముందు మాత్రం కదలడం లేదు!! ఎంతో ఉద్ధండులను సామదాన బేధ దండోపాయాలతో తన అక్కున చేర్చుకున్న తెలంగాణ చంద్రుడి వ్యూహాలు.. కోదండాస్త్రం ముందు బెడిసికొడుతన్నాయి. కేసీఆర్‌ను ఇప్పుడు ఇంతలా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి మరెవరో కాదు.. టీజేఏసీ చైర్మన్ కోదండరాం!! ఎంతో మంది నాయకులను […]
Tag: KCR
కోదండరాంను హీరోను చేసిన టీఆర్ఎస్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వర్సెస్ టీజేఏసీ చైర్మన్ కోదండరాం వార్ చినికి చినికి పెద్ద గాలివానలా మారుతోంది. కోదండరాం నిరుద్యోగుల కోసం చేపట్టిన ర్యాలీలో ముందస్తుగానే శాంతిభద్రతల పేరుతో ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం చెపుతున్నా వెనక చాలా రాజకీయాలు ఉన్నాయన్న విషయం తెలంగాణలో చాలామందికి తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోదండరాంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం, కోదండరాంను కులం పేరుతో విమర్శలు చేయడం, ముందస్తుగా అరెస్టులు చేయడం లాంటి విషయాల్లో టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందా […]
తిరుమల వెంకన్నకు కేసీఆర్ కానుకలు ఇవే…
తెలంగాణ ఉద్యమ సమయంలోని మొక్కులను, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు సీఎం కె,చంద్రశేఖర్ రావు!! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో తెలంగాణ సిద్ధించేందుకు ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడని ఆయన తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటీవలే భద్రాకళి అమ్మవారికి కిరీటం, ఖడ్గం; అలాగే కురివి మల్లన్నకు మీసాలు కూడా సమర్పించారు. ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడి మొక్కు చెల్లిచేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రూ.6కోట్ల విలువైన ఆరణాలను శ్రీవారికి కానుకగా సమర్పించబోతున్నారు. రెండు […]
మూడేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు తెలిస్తే షాకే..
విభజనతో 16వేల కోట్ల తీవ్ర లోటు బడ్జెట్‌తో ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ నష్టం కొనసాగుతూనే ఉంది. దీంతో అప్పు ఇచ్చే వారి కోసం ఏపీ ఎదురుచూస్తుంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా ఇలానే మారిందట. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణ సాధన వైపు అడుగులేస్తోందని నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇదంతా కేవలం ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమేనట. ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోందట. ఈ […]
కోదండరాంకి రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ …!
తెలంగాణ ఉద్యమ పోరులో తనకంటూ ఓ అధ్యాయాన్ని సొంతం చేసుకున్న ఉస్మానియా ప్రొఫెసర్ కోదండ రాం.. ఉద్యమ సమయంలో మేధావులను కదిలించిన తీరు నభూతో.. ! అయితే, నాటి ఉద్యమ నేతల్లో చాలా మంది కేసీఆర్ పంచన చేరి పదవుల్లో విలాస జీవితాలు గడుపుతుంటే.. కోదండరాం మాత్రం ప్రజల పక్షాన ఇంకా పోరాడుతూనే ఉండడం నిజంగా హర్షణీయం. ఇటీవల కాలంలో ఆయన ఊహించని విధంగా కేసీఆర్‌పై ఉద్యమ బావుటా ఎగరేశారు. మల్లన్నసాగర్ నిర్వసితులు, రైతులు, రీయింబర్స్‌మెంట్, సీఎం […]
ఆ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కకుండా మోడీ ప్లాన్
తెలంగాణలో టీఆర్ఎస్, భాజపా మధ్య క్రెడిట్ గేమ్ నడుస్తోందనే చర్చ మొదలైంది. తెలంగాణలో బలపడేందుకు బీజేపీకి అవకాశాలు ఉండటంతో అందుకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని ఆ పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు! ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ అంశంలోనూ బయటకి కనిపించని క్రెడిట్ గేమ్ మొదలైందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసంమాట్లాడేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చి.. రద్దు చేయడంపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య […]
తెలంగాణలో సీఎం క్రేజ్ డౌన్ ఫాల్స్ వెనక..?
తెలంగాణ ఉద్యమంతో దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసుకున్న ఏకైక నేత కేసీఆర్. తెలంగాణ ఆవిర్భవిస్తే.. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా చేస్తానంటూ ఆయన చేసిన సంచలన ప్రకటన దేశంలోని రాజకీయవర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇంత వరకు అలాంటి ప్రకటన ఏ ఒక్కరూ చేయకపోవడమే కారణం. అయితే, యధాలాపంగా ఆయనే సీఎం సీటును అలంకరించారు. ఈ పరిణామం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగానే తాను సీఎం కావాల్సి వచ్చిందని […]
మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు
తెలంగాణలో తిరుమలలా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి జిల్లా సీతారామచంద్రమూర్తి ఆలయం(భద్రాద్రి ఆలయం) పాలనా పగ్గాలు త్వరలోనే మై హోం వ్యవస్థాపకుడు జూపల్లి రామేశ్వరరావుకు అందనున్నాయట! ఆయనను చిన జీయర్ స్వామి సిఫార్సు చేశారని, దీనికి సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆమోదించారని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడ నున్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా రంగు పులుము కుంటుండడం గమనార్హం. ఎంతో మందిని కాదని రామేశ్వరరావుకు ఈ పోస్టు అప్పగించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జూపల్లి […]
తెలంగాణలో ప్లాప్ హీరోయిన్ కొత్త పార్టీ
తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీగా సరికొత్త పార్టీ రాబోతోంది. సినీ వినీలాకాశంలో స్టార్‌గా వెలుగొంది.. రాజకీయ నేతగా మారిన విజయశాంతి మరోసారి పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో చేరి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన ఆమె.. మరోసారి రాజకీయ తెరపై మెరిసేందుకు తహతహలాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్రంగా పోరాడిన రాములమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్‌కు తెరతీయబోతున్నారు. సొంత పార్టీతోనే ఇక రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి!! రాములమ్మగా వెండితెరపై ఓ […]