చందమామకి మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రఫీ

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రాఫర్‌గా మారనుండగా, ఆమె కొరియోగ్రఫీలో డాన్స్‌ చేసే అవకాశం కాజల్‌ అగర్వాల్‌ సొంతం చేసుకుంది. స్వయంగా మాధురీ దీక్షిత్‌ ఈ మాట చెప్పింది. మాధురీ దీక్షిత్‌ అంటే ఇష్టపడనివారెవరుంటారు? తన అందచందాలతో, తన నటనతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మాధురీ దీక్షిత్‌. ఆమె క్లాసికల్‌ డాన్సర్‌ కూడా. మోడ్రన్‌ డాన్సుల్లోనూ ఎంతో ప్రావీణ్యం మాధురీ దీక్షిత్‌ సొంతం. […]