కారులో ఇమడలేకపోతున్న డీఎస్!

ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]

వద్దన్నా పంపిస్తున్నారు..టీఆర్ఎస్ టూర్ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధిష్టానం ఇతర రాజకీయ పార్టీలకంటే ఓ స్టెప్ ముందే ఉంటుంది.. ఏసమస్య రాకపోయినా.. లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో పార్టీ చీఫ్ కేసీఆర్ అందెవేసిన చేయి. అందుకే తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటారు. ఇతర పార్టీల నాయకులు కూడా తమ సన్నిహితులతో ఇదే చెబుతుంటారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. […]

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విత్‌ పీకే పాలిటిక్స్

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్‌ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో […]

ఢిల్లీకే కవిత.. ఇదే కన్ఫర్మ్

ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోతోంది.. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి..అయితే.. మండలిలోకి మళ్లీ ఏం వెళతాం అనే అభిప్రాయంలో ఉన్నారు సీఎం కూతురు కల్వకుంట్ల కవిత. మరేం చేద్దాం.. ఏదో ఒక చట్టసభలో ఆమెకు స్థానం కావాలి.. రాజ్యసభకు పంపిద్దాం.. అరె.. అక్కడ ఖాళీల్లేవుగా.. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ముక్క పడాల్సిందే.. ఇపుడు అచ్చం తెలంగాణ రాజకీయంలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్.. ఆ పార్టీకి చీఫ్, ప్రభుత్వానికి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ […]

ఉన్నది మూడు నెలలే… ఆ తరువాత?

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కొత్త టెన్షన్ మొదలైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో అంటే మరో మూడు నెలల్లో ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అదేంటి.. ఆమె ఎమ్మెల్సీగా గెలిచింది గత సంవత్సరమే కదా .. ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నిజామాబాద్ లో కవిత గెలిచింది ఉప ఎన్నికల్లో.. అప్పటికే సమయం […]