సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]

జ‌గ‌న్‌కు యాంటీగా అనుకూల మీడియా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారికి మీడియా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సెపరేట్ గా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటి పని ఒకటే..ఎవరికి వారికి భజన చేయడం..ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడం..ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పని వచ్చి…చంద్రబాబుని పైకి లేపడం…జగన్ ని నెగిటివ్ చేయడం..ఇక వైసీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్ ని పైకి లేపడం…బాబుపై విమర్శలు చేయడం. […]

‘డబ్బు ఉంటేనే’..టీడీపీ కొత్త ఫార్ములా?

నెక్స్ట్ ఏపీ ఎన్నికలు పూర్తిగా డబ్బుమయం కానున్నాయి…ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి వందల కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి రావాలని టీడీపీ తెగ కష్టపడుతుంది. అధికారంలోకి రావాలంటే ప్రజా మద్ధతు మాత్రమే ఉంటే సరిపోదు…ఆర్ధిక బలం, అంగ బలం ఉండాలనేది టీడీపీ ఫార్ములా. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండటంతో..వైసీపీకి చెందిన అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉంటారనేది టీడీపీ అంచనా. అలాంటప్పుడు అధికారం, ఆర్ధికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులని ఓడించడం ప్రతిపక్షంలో టీడీపీకి చాలా […]

హిందూపురం ఎంపీ సీటు టీడీపీదేనా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం కూడా ఒకటి అని చెప్పొచ్చు..మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1984, 1996, 1999, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ లో టీడీపీ గెలిచింది..కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో టీడీపీ ఓటమి పాలైంది..అనూహ్యంగా పోలీస్ ఉద్యోగం వదిలేసి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరుపున గెలిచారు. ఇక పోలీసుగా ఉన్నప్పుడు మాధవ్ ఎన్ని వివాదాల్లో ఉన్నారో తెలిసిందే..అలాగే […]

మాధవ్ మ్యాటర్ లో జగన్ క్లారిటీ..!  

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు…అయితే ఈ వీడియో అనూహ్యంగా లీక్ అయ్యి..వైరల్ గా మారింది. ఇక దీనిపై మాధవ్ కూడా క్లారిటీ ఇచ్చారు..వీడియోలను మార్ఫింగ్ లు చేసి తనని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేశారని, దీనికి సంబంధించి ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వీడియోపై జిల్లా […]

కుప్పం లాజిక్: భరత్-మంత్రి…బాబు-సీఎం!

ఈ మధ్య ఏపీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని నడిపిస్తూ…పాలన పరమైన అంశాల్లో బిజీగా ఉన్న జగన్…కొంతకాలం నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలని ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల మద్ధతు తెచ్చుకుని, మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. అలాగే తాను కూడా వైసీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. 175కి 175 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు కంచుకోట […]

బాబు-పవన్ సైలెంట్ స్కెచ్..కలిసే?

ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఏపీలో అధికారం మళ్ళీ వైసీపీదే అని చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరొకసారి వైసీపీ అధికారం దక్కించుకోవడం గ్యారెంటీ అని సర్వేలు నిరూపిస్తున్నాయి…కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి భారీ మెజారిటీ రావడం మాత్రం కష్టమని తేలిపోతుంది…అదే సమయంలో టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కానీ అధికార వైసీపీని దాటడం టీడీపీకి కష్టమైపోతుంది. అలాగే జనసేన కూడా కాస్త బలం పుంజుకుంది..అలా […]

తిరుగుబాటు: వైసీపీలో మరో రెబల్?

అధికార వైసీపీలో ఈ మధ్య రెబల్ నాయకులు పెరుగుతున్నారు…అంటే తమ సొంత ప్రభుత్వంపై ఉన్న సంతృప్తి కావొచ్చు….తమ అధిష్టానంపై ఉన్న అసంతృప్తి కావొచ్చు..లేదా తాము ఎమ్మెల్యేగా ఉన్న సరే…కేవలం నిమిత్తమాత్రులుగానే మిగిలిపోతున్నామనే భయం కావొచ్చు…కారణాలు ఏదైనా గాని..ఈ మధ్య సొంత పార్టీకి వ్యతిరేకంగా పలువురు గళం విప్పుతున్నారు. అలాగే పార్టీలో జరిగే అంతర్గత పోరులని కూడా బయటపెడుతున్నారు. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీలో రెబల్ గా తయారయ్యి…అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ […]

కుప్పంతోనే మొదలు..జగన్ వదలరు..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే…కుప్పంలో పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటమని, అంటే కుప్పంలోనే గెలిచినప్పుడు…ఇంకా 175కి 175 సీట్లు గెలిచేయొచ్చని జగన్…ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునేటప్పుడు కుప్పంని ఉదాహరణగా చెప్పి..175 సీట్లు ఎందుకు గెలవకూడదో చెప్పాలని ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్ దృష్టి కుప్పంపై ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలంగా కుప్పంలో […]