శివ శంకర్ మాస్టర్ వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తా.. ముందుకొచ్చిన సోనూసూద్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన పెద్ద కుమారుడికి కూడా పాజిటివ్ తేలడంతో ఆయన కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. హాస్పిటల్లో వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చవుతుందని.. ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని శివ శంకర్ మాస్టర్ చిన్నకొడుకు విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. శివ శంకర్ మాస్టర్ […]

అత్యంత విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడు కూడా అపస్మారక స్థితిలోనే..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన పెద్ద […]

బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!

బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్ […]

బాలీవుడ్ లో థియేటర్లు రీఓపెనింగ్.. ఇందులో నిజమెంత?

ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలో ఎంతోమంది చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు కరోనా దాటికి ప్రభావితం కాగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం బాలీవుడ్డే. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ రావడానికి ముందు కొంచెం గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ ను బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయింది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో ఎప్పుడూ థియేటర్లు పూర్తిస్థాయిలో నడవలేదు. అయితే కరోనా […]

400 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ నిర్మాత.. ఎవరో తెలుసా?

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్ లలో విడుదల అవ్వాల్సిన చిత్రాలన్ని కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో,ఓటీటీలు భారీ ఆఫర్లతో దర్శక,నిర్మాతలను ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలో బాలీవుడ్‌ పెద్ద హీరోలు సల్మాన్‌ ఖాన్‌ రాధే, అజయ్‌ దేవగన్‌ భూజ్‌,ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా వంటి భారీ బడ్జేట్‌ చిత్రాలు సైతం ఓటీటీలోనే విడుదలయ్యాయి. అయితే ఇది నిర్మాతలకు లాభాలు బాట పట్టించినప్పటికీ.. .థియేట‌ర్ల‌ను న‌మ్ముకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లకు మాత్రం […]

కరోనా వేళ.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన భామలు..!

కరోనా సమయంలో అన్ని రంగాలు మూతపడి ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిస్థాయిలో థియేటర్ లు మూతపడడంతో పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ చేశారు.. అయితే ఈ కరోనా సమయంలో కూడా సినీ ఇండస్ట్రీకి కొత్త గా వచ్చి, తమ సత్తా ఏంటో ఓటీటీలో చాటారు కొంతమంది హీరోయిన్స్.. అయితే అదృష్టం కలిసి వచ్చిన ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. 1. […]

బిగ్ బాస్ నుంచి సరికొత్త అప్డేట్.. ఖుషి లో ఉన్న కంటెస్టెంట్స్..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది .అదే బిగ్ బాస్ రియాల్టీ షో. ఈరోజు నుంచి ఈ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కాకపోతే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు అందరూ దాదాపు 12 రోజుల నుండి క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ గత సీజన్ ఫోర్ సమయంలో కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో ఉంచగా, అప్పుడు ఇద్దరికీ కరోనా పాజిటివ్ […]

కేజ్రీవాల్‌ సోనూసూద్ ను అందుకే కలిశాడా?

సోనూసూద్ కరోనా మహమ్మారి సమయంలో చేసిన సామాజిక సేవతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా, లేదా అప్పుడే చెప్పలేము. అయితే సోనూసూద్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఒక వేదికపై కనిపించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ వేదిక పై సోనూసూద్‌ ను దేశ్ కే మెంటర్ అనే ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా స్కూలు పిల్లలకు భవిష్యత్ గురించి మార్గనిర్దేశం చేస్తారు. దిల్లీలోని […]

వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు … ?

కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75% వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. కొత్త మార్గదర్శకాలలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, టీకా సరఫరా షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత ప్రాధాన్యతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను తయారీ సంస్థలు మాత్రమే ప్రకటిస్తాయని ఆ మార్గదర్శకాలలో పేర్కొన్నారు. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత […]