గత వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరడంతో అంతా సద్దుమణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, తన బావమరిది బాలకృష్ణ పీఏ శేఖర్‌పై వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖర్‌పై వేటు వేయడంతో మొదలైన ఈ ప్రయాణంలో ఇంకా చాలామంది బాలయ్య సన్నిహితులు బయటికొచ్చే అవకాశముందని సమాచారం! ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. […]
Tag: chandrababu naidu
కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఏపీసీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే వాటికి కార్యకర్తలు తూట్లు పొడుస్తున్నారు! ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. చంద్రబాబు ముందు ఒకలా.. ఆయన వెనుక మరోలా వ్యవహరిస్తూ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎంత చెప్పినా కడప నాయకుల తీరు మారకపోవడంతో.. చంద్రబాబు ఇక వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం వీడకపోతే.. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. కడప జిల్లాపై సీఎం […]
ఎమ్మెల్యేగానే లోకేష్ పోటీ..! నియోజకవర్గం ఇదే..?
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని టీటీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పిన నాటి నుంచి.. టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ కోటా నుంచి ఎన్నుకుంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా లోకేష్‌ను భావిస్తున్న సమయంలో.. ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి వెళితే ప్రతికూల సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనేది ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇప్పుడు లోకేష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం! […]
ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?
కీలకమైన మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఉప ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది! అందులోనూ ఈ ఎన్నికల్లో సేఫ్ గేమ్‌కు తెరతీస్తోంది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని.. వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు.. వీరి విజయంతో తమ పార్టీకి తిరుగులేదని నిరూపించవచ్చనే వ్యూహంతో బరిలోకి దిగాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీలతో […]
బాబు కేబినెట్ లో వీరు సేఫ్
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడికలు, తీసివేతల్లో తలమునకలైపోయారు. ఈ క్రమంలో బాబు తన టీంలోని కొందరు మంత్రులను ఎలాంటి సంకోచం లేకుండా తీసి పక్కన పెడతారని టాక్ నడుస్తుండగా.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి మార్పూ ఉండబోదని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రులపై ఆరోపణలు […]
ఆ జిల్లాలో నలుగురు టీడీపీ సిట్టింగ్లకు టిక్కెట్లు కట్
గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి! ముఖ్యంగా రాజధాని ప్రాంతం కావడంతో అటు అధికార, విపక్ష పార్టీలు ఈ జిల్లాపై పూర్తిగా దృష్టిసారించాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే.. ఎవరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు? ఎవరికి టిక్కెట్టు ఇస్తారు అనే చర్చ అప్పుడే మొదలైంది. క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. ఇప్పటికే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తూ నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ. . ప్రజల్లో […]
బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?
శివరాత్రి చేసుకునేందుకు కనీసంలో కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. అయితే, ఇది సాధారణ జనాలకి. కానీ, ఏపీ మంత్రులకి మాత్రం శివరాత్రి జాగారం అప్పుడే వచ్చేసిందట!! అది కూడా నిత్యం తమ మధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చినబాబే మంత్రులకు శివరాత్రి తీసుకొచ్చారట! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒకరిద్దరు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులకు నిద్రమాత్రలేసుకున్నా.. […]
ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్
ఏపీ సీఎం చంద్రబాబు తన పవర్ చూపించారా? తనపై ఆరోపణలు చేస్తే.. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తెరవెనుక చేయాల్సింది చేసస్తానని బాబు చేసి చూపించారా? ఎంతటి వారైనా తనకు లోబడే ఉండాలనే సిగ్నళ్లను చంద్రబాబు పంపించారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చదవాల్సిందే! తన మంత్రి వర్గంలో కీలక బాధ్యతలను అప్పగించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి.. రెండు నెలల […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]